ఆర్మీలో చేరే వారికి గుడ్ న్యూస్…ఈనెల 29 నుంచి అగ్ని వీర్ ఎంపికలు?

ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువకులు దేశానికి సేవ చేయడం కోసం ఆత్మీయులు చేరాలని కలలు కంటున్నారు. ఆర్మీలో చేరి దేశానికి రక్షణగా నిలవాలని కలలు కంటున్నా యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్ని వీరనే సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని వీర్ పథకం ద్వారా యువకులకు నాలుగు సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించింది. తాజాగా అగ్ని వీర్ ఎంపికలు ప్రారంభం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అక్టోబర్ 29వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు అగ్ని వీర్ ఎంపికలు జరగనున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశానికి సేవ చేయాలని ఆలోచనలో ఉన్న యువకులు ఈ అగ్ని వీర్ ఎంపికలలో పాల్గొనాలని సూచించింది. అక్టోబర్ 29వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ కేంద్రంలోని ఏబిసి ట్రాక్ లో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఏఓసి కేంద్రం ప్రకటన చేసింది.

ఈ ఎంపికలో హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్ని జనరల్ డ్యూటీ, ట్రేడ్స్ మెన్, టెక్ మరియు క్రీడాకారుల విభాగాల్లో ఆసక్తి ఉన్న యువతి యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు అని కేంద్రం ప్రకటించింది. ఈ ఎంపికలో పేర్లు నమోదు చేసుకోవడానికి 17 సంవత్సరాలు నుంచి 23 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువతి యువకులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని పేర్కొంది. ఇక అగ్ని వీర్ జీడి, ట్రేడ్స్ మెన్ పదవికి పదవ తరగతి అర్హత కలిగిన యువతి యువకులు అర్హులు కాగా.. టెక్ కి సైన్యంలో చేరాలనుకునేవారు ఇంటర్ పాస్ అయి ఉండాలని పేర్కొంది.