వైకాపా సోషల్ మీడియా పెద్ద విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేష్ మీద విపరీతమైన రీతిలో ట్వీట్లు వేస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు ట్వీట్లతో వారిద్దరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సాయిరెడ్డి తాజాగా మరోమారు ట్వీట్ల యుద్దానికి తెర తీశారు. ఈ లాక్ డౌన్లో పెదబాబు, చినబాబు కలిసి కాలం గడిపారని, అందులో చినబాబు దేనికీ పనికిరాడని పెదబాబు, పెదబాబు అన్నింటిలోనూ బ్యాడ్ అని చినబాబు గ్రహించారని వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే బాబుగారి మనసు ఢిల్లీ చుట్టూ తిరుగుతోందని, భాజాపాకు దగ్గరకావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
దీంతో టీడీపీ ఎంపీ కేశినేని నాని గట్టిగా రియాక్ట్ అయ్యారు. సాయిరెడ్డి ఎంత వెక్కిరింపుగా ట్వీట్లు వేశారో అలానే సమాధానం ఇచ్చారు. ఏ1, ఏ2లుగా సంవత్సర కాలం జైలులో గడిపిన ఇద్దరూ ప్రజాధనం దోచుకోవడానికి మాత్రమే పనికివస్తామని డిసైడ్ అయ్యారా అని ఢిల్లీలో మనకేమో అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిముషంలో రద్దు చేస్తారు అంటూ కొన్ని రోజుల క్రితమే చివరి నిముషంలో అమిత్ షా సీఎం జగన్మోహన్ రెడ్డికి తన అపాయింట్మెంట్ రద్దు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఈ అపాయింట్మెంట్ రద్దు విషయంలో వైసీపీ నేతలు కూడా బాగా క్కన్ఫ్యూజ్ అయ్యారు. సీఎం హోదాలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలో మాదిరిగానే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏమిటని మండిపడ్డారు. ఇకపోతే గతంలో కూడా పలుమార్లు విజయసాయిరెడ్డి విమర్శలకు కేశినేని నాని రివర్స్ కౌంటర్ వేశారు. అవన్నీ ఒక ఏత్తైతే ఈసారి ట్వీట్లు మాత్రం మరొక ఎత్తని అంటున్నాయి టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు.