ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్ కొన్ని దేశాల్లో మాత్రం తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ మహమ్మారి బ్రిటన్ను వణికిస్తోంది. వారం రోజులుగా దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కొవిడ్ బారిన పడినట్లు బ్రిటన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గడిచిన వారంలో ఏకంగా 49లక్షలు మంది వైరస్‌కు గురైనట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.2 ప్రస్తుతం బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాపి చెందుతుంది. కరోనా విజృంభణతో బ్రిటన్ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయగా పెరుగుతుంది. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండడం కాస్త ఊరట నిస్తోంది.