టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆయన రాజకీయం అంతా మీడియా మాటల్లోనూ…చేతల్లోనే ఉంటుంది. తప్ప సోషల్ మీడియాలో ప్రత్యర్ధులపై విమర్శలు చేయడాలు, చేసిన పనుల గురించి గొప్పలు చెప్పుకోవడం వంటింది పెద్దగా ఉండదు. ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మాత్రం ట్విటర్ వంటి మాధ్యమాల్లో స్పీడ్ గానే ఉంటారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే ట్విటర్లో యామా స్పీడ్ గా ఉంటారు. రాజకీయ పరంగా చూసుకుంటే చంద్రబాబు, జగన్ కంటే ట్విటర్ ని ఎక్కువగా వినియోగించేది పవన్ కళ్యాణ్.
పార్టీలను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ట్విటర్ పేజీలో ఎప్పటికప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఇక ఆయనకు ఫాలోయింగ్ పీక్స్ లో నే ఉంది. పవన్ రాజకీయ నాయకుడు కంటే ముందు పెద్ద స్టార్ హీరో కాబట్టి అందరికంటే ఫాలోయింగ్ లో మొదటి ప్లేస్ ఉంటారనుకుంటాం. ఇక ఏపీకి ప్రస్తుతం సీఎం జగన్ కాబట్టి ఆయన ఖాతాని అనుసరించే వాళ్లు ఎక్కువగానే ఉంటారనుకుంటాం. కానీ ఇక్కడ ఆ రెండు జరగలేదు. పవన్, జగన్ కన్నా అధికంగా ట్విటర్ ఫాలోవర్స్ ని కల్గి ఉన్నది చంద్రబాబు నాయుడు కావడం విశేషం. తాజాగా పవన్ 4 మిలియన్లు( 40 లక్షల మంది) ఫాలోవర్స్ కి రీచ్ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ తన ఫాలోవర్స్ అందిరికీ ధన్యవాదాలు తెలియజేసారు. ఇక జగన్ ట్విటర్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ కన్నా చాలా తక్కువగా ఉన్నారు. కేవలం 1.6 మిలియన్ల( 16 లక్షలు) మందే ఉన్నారు. ఇక నారా లోకేష్ కి అత్యల్పంగా 7.82 లక్షల మందిని ఉన్నారు. వీళ్లందరికంటే చంద్రబాబు ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కల్గి ఉన్నారు. ఆయన ఏకంగా 4.7 మిలియన్లు( 47 లక్షల మంది ) ఉన్నారు. చంద్రబాబు దరిదాపుల్లో ఏపీ నుంచి రాజకీయంగా చూసుకుంటే కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. ఆ రకంగా చంద్రబాబుని బీట్ చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది.