ఉపేంద్ర విడుదల చేసిన ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్

యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం, ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్, బెంగళూరు లోని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆడిటోరియం లో గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లహరివేలు మాట్లాడుతూ ఉపేంద్ర తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు, చిత్రం మంచి విజయాన్ని సాధించాలని టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేశారు.

భయంకరమైన హత్యల నేపథ్యంలో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనే ఆసక్తిని రేకెత్తించడంతోపాటు, హత్యకి గురైన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను కూడా ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. కోర్టులు కూడా ఈ హత్యలకు అడ్డుకట్ట వేయలేకపోతాయి. అటువంటి పరిస్థితుల్లో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. ట్రైలర్ ఆద్యంతం హైటెక్నికల్ వాల్యూస్ తో ,రిచ్ ఫోటోగ్రఫీ, టెర్రిఫిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకునేలా సాగింది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్ తో మెప్పించారు. ఈ ట్రైలర్ చిత్రం మీద అంచనాలను మరింతగా పెంచింది.

దర్శకుడు త్రివిక్రమ్ రఘు మాట్లాడుతూ, “ప్రియాంక మేడం నా టాలెంట్ ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ఈ చిత్రం ప్రారంభించినప్పటి నుంచి ఆవిడ అందించిన సహాయ సహకారాలు మర్చిపోలేనివి. నా ఐడియాస్ కు తెరమీద ప్రాణం పోయడానికి ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారు. మరో రెండు నెలల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం”

రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ, “ప్రతి మహిళలోనూ ఒక డిటెక్టివ్ ఉంటారు ప్రత్యేకంగా నా ఇంట్లో మరీ ఎక్కువ. ప్రతి భర్తకు తన భార్య డిటెక్టివే. డిటెక్టివ్ పాత్రలను సరిగ్గా మలిచినప్పుడు అవి తెరమీద అద్భుతంగా వస్తాయి. ట్రైలర్ లో మ్యూజిక్ రోమంచితంగా ఉంది. ప్రియాంక 50 చిత్రాలు పూర్తి చేశారు. నేను ఇంకా 46వ చిత్రం దగ్గరే ఉన్నాను. మా వందో చిత్రానికి మేమిద్దరం కలిసి పని చేస్తామని ఆశిస్తున్నాను. ‘డిటెక్టివ్ తీక్షణ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఈ చిత్రం మీకు అందిస్తుంది.”

నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా తమకు ఎంతో సపోర్ట్ చేస్తున్న ప్రియాంక ఉపేంద్ర కు కూడా థాంక్స్ చెప్పారు.

ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను 50 చిత్రాలు నటించానని తలుచుకున్నప్పుడు అవి 50 సెకండ్లు మాదిరిగా అనిపిస్తాయి. దీనికి కారణం ఆయా చిత్రాల్లో నన్ను ఎంచుకున్న దర్శక నిర్మాతలే. నేను ఎవరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాను. ‘డిటెక్టివ్ తీక్షణ’ కోసం అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పని చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో కూడా సెట్ లో అందరూ ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేకపోయినప్పటికీ మెంటల్ గా మాత్రం ఎంతో షార్ప్, బ్రిలియంట్ దర్శకుడు త్రివిక్రమ్ రఘుకు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది.”

చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయ సూర్య తో పాటు ఇతర ముఖ్యపాత్రలో కనిపించిన సిడ్లింగు శ్రీధర్, శశిధర్ మరియు ఆర్ డైరెక్టర్ నవీన్ కుమార్ తమ అనుభవాలను పంచుకున్నారు. వీరితో పాటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బిఏ.ఎంఏ. హరీష్ మరియు టాలీవుడ్ పి ఆర్ ఓ బిఏ రాజు’s టీం (శివకుమార్ బి) కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతాన్ని పి రోహిత్ అందించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘డిటెక్టివ్ తీక్షణ’ ను కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒరియా, వంటి ఏడు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Detective Teekshana Trailer [Telugu] | Priyanka Upendra | 50th |Trivikram Raghu|Event Linkx Ent |SDC