The Hunt The Rajiv Gandhi Assassination Case: ‘ది హంట్‌: రాజీవ్ గాంధీ హ‌త్య కేసు’.. జూలై4 నుంచి సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌

ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం సోనీ లివ్‌, అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కుకునూర్ మూవీస్‌తో క‌లిసి, ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్త‌కం నైంటీ డేస్ ఆధారంగా ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ అనే ఉత్కంఠ‌భ‌రిత పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను ప్రేక్ష‌కుల‌ను అందించ‌నుంది.

https://www.instagram.com/reel/DLCfyjOoeRa

జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేక‌ర్ న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో.. రోహిత్ బ‌న‌వాలిక‌ర్‌, శ్రీరామ్ రాజ‌న్‌తో క‌లిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. గూఢ‌చర్యం, అనిశ్చిత‌మైన వాతావ‌ర‌ణం, ఇంటెలిజెన్స్ వైప‌ల్యంతో పాటు న్యాయం కోసం చెల్లించిన భారీ మూల్యం క‌ల‌బోత‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. అమిత్ సియాల్ – డి.ఆర్. కార్తికేయన్ (ఎస్‌.ఐ‌.టి చీఫ్), సాహిల్ వైద్ – అమిత్ వర్మ (ఎస్‌.పీ-సీబీఐ), భగవతీ పెరుమాళ్ – రాఘవన్ (డి‌.ఎస్‌.పీ-సీబీఐ), డానిష్ ఇక్బాల్ – అమోద్ కాంత్ (డి‌.ఐ‌.జి-సీబీఐ), గిరిష్ శర్మ – రాధావినోద్ రాజు (డి‌.ఐ‌.జి-సీబీఐ), విద్యుత్ గర్గ్ – కెప్టెన్ రవీంద్రన్ (ఎన్‌ఎస్‌జీ కమాండో), శఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శృతి జయన్, గౌరి మీనన్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

ది హంట్‌: రాజీవ్ గాంధీ హ‌త్య కేసు.. జూలై 4 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌

సిగ్గుండాలి || Producer Chittibabu Fires On Pawan Kalyan Over Kuppam Women Incident || Telugu Rajyam