లవ్ స్టొరీ “సఖి” డిసెంబర్ 15న థియేటర్స్ లో !!!

వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వస్తోన్న సినిమా సఖి. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి , జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా జానీ బాషా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్థు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సఖి సినిమా డిసెంబర్ 15న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉంటుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు యువత నుండి విశేష స్పందన లభించింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సన్నీ సంకురు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ కుమార్ కారే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు: లోకేష్ ముత్తుమల , దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి , జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య,

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత: పార్థు రెడ్డి
దర్శకత్వం: జానీ బాషా
కెమెరామెన్: సతీష్ కుమార్ కారే
సంగీతం: సన్నీ సంకురు
కొరియోగ్రఫీ , కో డైరెక్టర్: రామ్ సాయి ముంగ
డిజిటల్ ప్రమోషన్స్: అశ్వత్ రెడ్డి

Sakhi Theatrical Trailer | Lokesh | Deepika Vemireddy | Pardhu Reddy | Johnny Basha | One Media Et