ఓటీటీలోకి రుహానీ శర్మ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హర్‌’

చి.ల. సౌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రుహానీ శర్మ. ఇందులో అంజలి అనే పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘సైంధవ’ లో కీ రోల్‌ పోషిస్తోంది.

కాగా రుహాని నటించిన లేటెస్ట్‌ ‘హర్‌- ఛాప్టర్‌ 1’. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 21 న థియేటర్లలో రిలీజైంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయడంతో పై హైప్‌ వచ్చింది. అయితే ప్రమోషన్‌ కార్యక్రమాలు పెద్దగా నిర్వహించలేదు. దీంతో ఆడియెన్స్‌ నుంచి పెద్దగా రెస్పాన్స్‌ కాలేదు. అయితే చూసిన వారంతా కాన్సెప్ట్‌, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ బాగుందని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు.

అలాగే రుహానీ నటన కూడా బాగుందంటూ కితాబిచ్చారు థియేటర్లలో మోస్తరుగా ఆడిన హర్‌-ఛాప్టర్‌ 1 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో హర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 15) అర్ధరాత్రి నుంచే రుహానీ శర్మ ఓటీటీలోకి వచ్చేసింది.

హర్‌ – చాప్టర్‌ 1 లో రుహానీ శర్మ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా నటించింది. ఆమెతో పాటు వికాశ్‌ వశిష్ట, ప్రదీప్‌ రుద్ర, జీవన్‌ కుమార్‌, సంజయ్‌ స్వరూప్‌, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీధరర్‌ స్వరాగమ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. డబుల్‌ అప్‌ మీడియాస్‌ పతాకంపై రఘు సంకురాత్రి, దీప ఈ చిత్రాన్ని నిర్మించారు.

పవన్‌ స్వరాలు అందించగా.. చాణక్య ఎడిటర్‌గా, విష్ణు టోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌ నగర శివార్లలో వరుసగా రెండు హత్యలు జరుగుతాయి. వీటి గుట్టు తెలుసుకునేందుకు ఏసీపీ అర్చనా ప్రసాద్‌ (రుహానీ) రంగంలోకి దిగింది.

మరి ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేశారు? ఏసీపీ అర్చన నేరస్తులను ఎలా పట్టిందు తెలుసుకోవాలంటే హర్‌ చూడాల్సిందే. లోని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. మరి థియేటర్లలో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇన్వెస్టిగేషన్‌ ను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఓటేయండి.