దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ‘ఉత్సవం’ సెప్టెంబర్ 13న రిలీజ్- AP, TGలో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు చాలా క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. ‘ఉత్సవం’ లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి
నిర్మాత: సురేష్ పాటిల్
సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.
గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డీవోపీ: రసూల్ ఎల్లోర్
డైలాగ్స్:రమణ గోపిసెట్టి
డిఐ & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్
మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్
పీఆర్వో: వంశీ- శేఖర్