IT Raids: టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం.. బడా నిర్మాతలకు బిగ్ షాక్

IT Raids: టాలీవుడ్‌లో ఐటీ దాడులు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాములు నవీన్, సీఈవో చెర్రీ నివాసాలతో పాటు, వారి కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. 55 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాముఖ్య ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకోవడం విశేషం.

దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఉన్నారు. ఇటీవల ఆయన నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయం సాధించి రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆయన కుమార్తె హన్సితా రెడ్డి నివాసం సహా కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఈ దాడులు పెద్దఎత్తున జరుగుతుండడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యంగా నిలిచింది. పుష్ప 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ను అందించిన మైత్రి భాగస్వాములు నవీన్, చెర్రీ ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ సంస్థ ఇటీవల పుష్ప 2 తో దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ కారణంగానే ఈ సంస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారని భావిస్తున్నారు.

ఈ ఐటీ దాడులు ఆకస్మికంగానే ప్రారంభమైనప్పటికీ, దిల్ రాజు, మైత్రి మేకర్స్ వంటి ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు, వాటి ఆధారంగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎక్కువ బడ్జెట్‌తో నిర్మాణాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై ఐటీ శాఖ దృష్టి సారించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దిల రాజు నిర్మించిన పలు పెద్ద సినిమాలు ఇటీవలే విడుదల అయ్యాయి. అలాగే, మైత్రి మూవీ మేకర్స్ కూడా వరుస విజయాలతో టాలీవుడ్‌లో ప్రాముఖ్యత పొందింది. ఈ సోదాలు పరిశ్రమలో కుదుపు తెచ్చాయి. ఈ దాడులపై ఇంకా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

సైఫ్ కరీనా మధ్యలో పనిమనిషి || Director Geetha Krishna About Saif Ali Khan Incident || Telugu Rajyam