Chandreshwara: పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చంద్రేశ్వర… ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చంద్రేశ్వర… ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి ,ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘చంద్రేశ్వర’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ: ఇదొక ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో మంచి డివోషనల్ టచ్ కూడ వుంటుంది . ఈ చిత్రంలో శివుని నేపథ్యంలో ఉండే సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. జరార్డ్ ఫిలిక్స్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే సీనియర్ నటులు ఎంతోమంది ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హం గులతో ఫిబ్రవరి నెల ఆఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

సురేష్ రవి, ఆశ వెంకటేష్, నిలగల్ రవి, బోసే వెంకట్, అడుకులం మురుగదాస్ గజరాజ్, జె ఎస్ కే గోపి, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జెరాడ్ ఫిలిక్స్, డిఓపి: ఆర్వి సీయోన్ ముత్తు, సింగర్స్: సాయి చరణ్, లిరిక్స్: వెంకట్, జ్యోతి, డిటిఎస్: శ్యామ్, ఎడిటర్: నందమూరి హరి, పిఆర్వో: బి. వీరబాబు, కో ప్రొడ్యూసర్ పి.సరిత , వి. బాలకృష్ణ,ప్రొడ్యూసర్: డాక్టర్ రవీంద్ర చారి, డైరెక్టర్: జీవి పెరుమాళ్ వర్ధన్

Public Reaction On Ys Jagan Comments On Chandrababu Ruling || Ap Public Talk || Pawan Kalyan || TR