బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రేక్షకులు ఎంతోకాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం ప్రారంభం అయింది. ఈ సీజన్ 6 లో ఏకంగా 20 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీలో కొంచెం పేరు ఉన్నవారే. అయితే బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఈ సీజన్ 6 లో పాల్గొనబోయే సామాన్యులు ఎవరు అనేది ఇప్పుడు చర్చంశనీయంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న రేవంత్, శ్రీహాన్, ఫైమా, చంటి, అభినయశ్రీ, సుదీప, నేహా చౌదరి, ఇనాయ సుల్తానా వంటి దాదాపు 18 మంది కంటెస్టెంట్లు ఒక మోస్తారు ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే. అయితే ఈ సీజన్ సిక్స్ లో సామాన్యుల కేటగిరీ కింద ఎంటర్ అయిన ఆదిరెడ్డి, ఆరోహికి కూడా ఒక మోస్తారు బ్యాక్ గ్రౌండ్ ఉంది. సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఆది రెడ్డీ యూట్యూబర్ గా బాగా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ గురించి సర్వే చేస్తు రేటింగ్స్, రివ్యూస్ ఇచ్చే ఆదిరెడ్డి ఒక బ్యాంక్ ఎంప్లాయ్. కానీ ఇపుడు యూట్యూబర్ గా బాగా పాపులర్ అయ్యాడు.
ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఎంటర్ అయిన ఆరోహి కూడా ఇండస్ట్రీలో ఒక మోస్తరు బ్యాక్ గ్రౌండ్ ఉంది. తల్లి చిన్నతనంలోనే చనిపోతే తండ్రి వేరొక మహిళను పెళ్ళి చేసుకొని తననీ ఒంటరిగా వదిలి వెళ్ళాడు. దీంతో అమ్మమ్మ దగ్గర పెరిగి ప్రయోజకురాలు అయ్యింది. మొదట యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆరోహి రావ్ అలియాస్ అంజలి తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించి గుర్తింపు పొందింది. ఆ తర్వాత టీవీ9 లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ న్యూస్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడికి కూడా ఇండస్ట్రీలో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉందనే చెప్పవచ్చు. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఎంట్రీ ఇచ్చిన వీళ్లు కూడా సెలబ్రిటీలేనని తెలుస్తోంది.