బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన మిల్కీ బ్యూటీ… ఆ విషయంలో ఇద్దరిని బాగా ఎంకరేజ్ చేసిందిగా..?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 మంచి రేటింగ్స్ దక్కించుకుంటు ముందుకి సాగిపోతోంది. ఇక ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 6 రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ప్రతి ఆదివారం నాగార్జున ఒక సెలబ్రెటీ చేస్తుంది హౌస్ లోకి పంపిస్తారు. ఈ క్రమంలో ఈ వారం మిల్కీ బ్యూటీ తమన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. ఇటీవల తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆదివారం బిగ్‌బాస్‌ షోకి వెళ్లింది. ఇక తమన్నా హౌస్ లోకి వెళుతూ వెళుతూ ఒక గిఫ్ట్ కూడా తీసుకొని వెళ్ళింది.

తమన్నా హౌజ్ లోకి వెళ్ళిన తర్వాత హౌస్‌లో ఉన్న మేల్ కంటెస్టెంట్లను…లేడి కంటెసెంట్స్‌లో ఎవరు బౌన్సర్‌ కావాలనుకుంటున్నారో చెప్పి వారి చేతికి బ్యాండ్‌ కట్టాలని నాగార్జున చెప్పాడు. దీంతో మేల్ కంటెస్టెంట్లు వారికి నచ్చిన లేడీ కంటెస్టెంట్ చేతికి బ్యాండ్‌ కట్టారు. ఈ క్రమంలో చలాకీ చంటి ఫైమా చేతికి బ్యాండ్ వేసి బౌన్సర్‌ కావాలని కోరుకున్నాడు. ఇక ఫైమా బౌన్సర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటూ నాగార్జున ప్రశ్నించడంతో చంటి సమాధానం చెప్పాడు. రాత్రిపూట రాజశేఖర్ తో కలిసి పడుకున్నప్పుడు అతను తేడాగా పడుకుంటున్నాడు. అంతేకాకుండా దుప్పటి దిండు కూడా మాయమవుతుంది. అందువల్ల వాడు భయపడేది దీనికి ఒకదానికే అని చెప్పటంతో అందరూ నవ్వారు.

ఇక అర్జున్ కళ్యాణ్ వంతు వచ్చినప్పుడు..తాను గీతు, శ్రీ సత్య కి ఈ బ్యాండ్ వేయాలనుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఈ షో కి వచ్చిన ఆడియన్స్‌ అంతా గట్టిగా ఈళలు వేశారు. దీంతో నాగార్జున ఈ సౌండ్ ఎందుకు అని అడగ్గా … ‘వారి మధ్య ఏదో ఉంది’ అని అక్కడ ఉన్న ఒక అమ్మాయి చెప్పడంతో అందరూ గట్టిగా నవ్వారు.దీంతో ‘అదేం లేదు సర్‌.. మేం జస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే’ అని అర్జున్‌ అనగానే.. నేను ఏమన్నా అన్నానా ? అని నాగార్జున నవ్వాడు. ఇక తమన్నా కూడా కల్పించుకొని మేము..’ఎన్ని సినిమాల్లో ఇలా యాక్ట్‌ చేయలేదు..మొదట్లో ఫ్రెండ్స్‌ తర్వాత… అంటూ వారి మద్య ఉన్న రిలేషన్ ని ఎంకరేజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.