అల్లు అర్జున్ , సాయి పల్లవి నా ఫేవరేట్ యాక్టర్స్ : అతిర రాజ్ !!!

నాది కేరళ, చిన్నపాటి నుండి నటన పట్ల ఆసక్తి ఉన్నందున సినిమా రంగంలోకి వచ్చాను. మా పెదనాన్న పద్మనాభన్ నా రోల్ మాడల్, తను మలయాళం సీరియల్స్ లో నటించేవారు. అల్లు అర్జున్, సాయి పల్లవి నటన నాకు ఇష్టం, చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను.

కృష్ణమ్మ సినిమా లో సత్యదేవ్ గారితో నటించడం మర్చిపోలేని అనుభూతి, ఈ చిత్ర షూటింగ్ విజయవాడ పరిసర పాంతాల్లో జరిగింది, ఆ టైమ్ లో అక్కడి తెలుగు వారు చూపించిన ప్రేమను మర్చిపోలేను. కృష్ణమ్మ సినిమాలో మీన పాత్రలో నటించాను, ఆడిషన్ ద్వారా నాకు ఈ పాత్ర వచ్చింది, నా రోల్ కు వస్తోన్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కృష్ణమ్మ సినిమాకు వస్తోన్న ఆదరణ చూస్తుంటే హ్యాపీగా ఉంది.

నేను స్వయంగా క్లాసికల్ డాన్సర్ ను, అలా డిగ్రీ చేస్తున్న సమయంలో కేరళలో మ్యూజిక్ ఆల్బమ్ చేశాను, దానికి మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత తమిళ్ లో అమిగో గ్యారేజ్, వీరన్, సినిమాలు చేశాను. తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్నాను, త్వరలో వాటి వివరాలు తెలియజేస్తాను.

మంచి సినిమాల్లో నటించాలని ఉంది, తెలుగు, తమిళ్ తో పాటు మలయాళంలో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. నటనకు గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించాలని ఉందని హీరోయిన్ అదితి రాజ్ తెలిపారు.