ఉద్యోగానికి ఆశపడి నెలరోజులపాటు రైల్వేస్టేషన్లో వచ్చి పోయే రైలను లెక్కబెట్టిన యువకులు… చివరికి ఏమైందంటే?

Railways to charge user fee at busiest railway stations

ప్రస్తుత కాలంలో విద్యావంతులైన యువతి యువకులు ఉద్యోగాలు సంపాదించడానికి చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి యువతీ యువకులను ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని వారిని నమ్మించి నిండా ఉంచుతున్నారు. ఇలా ప్రతి ఏటా ఎంతోమంది ఉద్యోగాల కోసం ఆశపడి కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజాగా ఎటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు దిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో కొయంబత్తూరుకు చెందిన శివరామన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ శివరామన్ అతనిని నమ్మించాడు. దీంతో సబ్బు సామిని నమ్మి 25 మంది యువకులు సుబ్బు సామితో కలసి ఢిల్లీ వెళ్లారు. శివరామన్‌ అనే వ్యక్తిని కలవగా అతను వారందరినీ వికాస్‌ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు.
ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానంటూ రాణా అందరినీ నమ్మించి రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్‌ అసిస్టెంట్, క్లర్క్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.24లక్షల వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత వైద్య పరీక్షలు, పత్రాల తనిఖీ చేసి.. అనంతరం ఫోర్జరీ పత్రాలతో శిక్షణ ఆర్డర్లు కూడా ఇచ్చి ఐడీ కార్డులు కూడా జారీ చేశాడు.

ఆ తర్వాత వారందరినీ శిక్షణ పేరుతో ఢిల్లీ లోని ఓ రైల్వే స్టేషన్‌లో రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌కు వచ్చేపోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అని నమ్మించాడు. నెలరోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా జారీ చేశాడు. ఆ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఉద్యోగం కోసం రైల్వే అధికారుల వద్దకు వెళితే.. అవి ఫోర్జరీ పత్రాలని రైల్వే అధికారులు చెప్పటంతో వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న ఆ 28 మంది సుబ్బుసామిని ఆశ్రయించి ఢిల్లీ ఆర్థిక నేరల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.