వాలెంటైన్స్ డే రోజు హిజ్రాను పెళ్లాడిన యువకుడు

ఆ ట్రాన్స్ జెండర్ పై అతనికి ప్రేమ పుట్టింది. గత సంవత్సర కాలం నుంచి  ఆమెను ప్రేమిస్తున్నాడు. నీ పైన నా ప్రేమకు అంతేలేదు… నిన్ను నా కలల రాణిగా చూసుకుంటా అని అన్నాడు. అంతే మనసు కరిగి అతనినే పెళ్లి చేసుకునేందుకు ఆ ట్రాన్స్ జెండర్ సిద్దమైంది. ప్రేమికుల రోజున వారి పెళ్లి జరిగింది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

మధ్యప్రదేశ్ కు చెందిన జువైద్ ఖాన్, ట్రాన్స్ జెండర్ జయా సింగ్ ను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. ఆమెనే ఫాలో అవ్వుతూ ఘోరంగా ప్రేమించాడు. ఆమె హిజ్రా అని తెలిసినా ఆమె వెంట పడ్డాడు. రెండు వారాల క్రితం జునైద్ ఖాన్ జయాసింగ్ కు ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. ఇద్దరూ ప్రేమికుల రోజే మంచి ముహుర్తంగా భావించి అదే రోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి జూనైద్ ఖాన్ ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా వారిని ఎదురించి ప్రేమించిన జయాసింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం వారు  ఓ దేవాలయంలో ఒక్కటయ్యారు.

జూనైద్ ఖాన్ తమ పెళ్లి గురించి మీడియాతో మాట్లాడారు. జూనైద్ ఏమన్నారంటే…

 ‘నా కుటుంబం మా పెళ్లిని ఒప్పుకోవాలనుంది. ఒకవేళ వారు ఒప్పుకోకపోయినా నేను జయాతోనే ఉంటాను. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను. వివాహ బంధంతో ఒక్కటయ్యాం. ఎవరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు.’ అని జునైద్‌ ఖాన్‌ మీడియాకు తెలిపాడు.

జయాసింగ్ ఏమన్నారంటే…

 ‘ట్రాన్స్ జెండర్స్ కు పెళ్లవ్వడం ఓ సవాల్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ సమాజం వారి పెళ్లిలను అంగీకరించదు. అతని తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోనప్పటికి జునైద్‌ నన్నే పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికైనా వారు మా పెళ్లిని అంగీకరిస్తాని ఆశిస్తున్నాను. ఏదో ఒకరోజు మా అత్త, మామలకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతోంది.’ అని జయాసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక సోషల్‌ మీడియా వేదికగా ఈ జోడికి మద్దతు లభిస్తోంది.