భారత్ బాలాకోట్ దాడి ఎందుకు ఈజీ అయిందంటే…

 
పుల్వామా దాడి తర్వాత భారత్ ఎదురు దాడి ఉంటుందని పాక్ లోని తీవ్రవాదులకు అనుమానం వచ్చింది. దీనితో వారంతా పాక్ అక్రమిత కాశ్మీర్ లో అక్కడక్కడా ఉన్న శిక్షణా శిబిరాలను ఖాళీ చేసి రక్షణ కోసం ఒకే చోటకు వచ్చారు. దీనిని భారత్ నిఘావర్గాలు పసిగట్టాయి. అందుకే వారి పని కూడా సులువయిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి..
 దాడి భయంతో వందలాది మంది ఫిదయీన్ లను, వారికి శిక్షణ ఇచ్చేవారిని పాక్ అక్ర మిత కాశ్మీర్ లో బాలాకోట్ సమీపంలో ఒక దట్టమయిన అడవిలోని  ఒక కొండ మీద శిబిరానికి తరలించారు.ఇది జనావాసాలకు దూరంగా కూడా ఉంటుంది.ఈ క్యాంపును నడిపిస్తున్నది మౌలానా యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ గౌరి . అతగాడు జైస్ ఇ మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కు బామ్మర్ది.
ఇది దాదాపు ఫైవ్ స్టార్ స్టయిల్ శిక్షణాశిబిరం. దాడి భయంతో ఎక్కడెక్కడో వుండే వాళ్లంతా ఒకే చోటికి చేరుకోవడంతో  భారతీయ వైమానికి దళాల పని మరీ సులువయింది.ఒకే చోట దాడిలో లక్ష్యం నెరవేరింది. ఈ దాడిలో  దాదాపు 320 నుంచి 350 మంది దాకా చనిపోయి ఉంటారని వార్తా సంస్థలు చెబుతున్నాయి. చనిపోయిన వారి లో 27 మంది దాకా శిక్షకులు ఉన్నారు.
దాడి జరిగే సమాయానికి శిబిరంలో టెర్రరిస్టులంతా నిద్రలో ఉన్నారు. పాకిస్తాన్ యావత్తు నిద్రలో జోగుతున్నపుడు ఇలా దాడి జరుగుతుందని పాక్ సైన్యం కూడా పసిగట్టలేక పోయింది. పాక్ సైన్యానికి ఇదొ క పెద్ద షాక్. ఎందుకంటే, భారత దేశం ఒక వేల సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినా ఎల్ వొసి పక్కనే ఉన్న శిబిరాల మీద దాడులు చేయవచ్చని మాత్రమే అనుకుంది. అయితే, పాకిస్తాన్ లోకి ఇంత దూరం చొరబడతారని వూహించ లేకపోయారు. ఈ శిబిరం లో భారతీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 500 నుంచి 700 మందికి శిక్షణ ఇచ్చేందుకు వసతి ఉంది. వాళ్ల కోసం  వంటవాళ్లున్నారు, పనివాళ్లున్నారు. ఈ శిబిరంలో ఒక ఈత కొలనుకూడా ఉందని నిఘావర్గాలు కనుగొన్నాయి.
దాడి ఇలా జరిగింది
భారతదేశం వెస్టన్ అండ్ సెంట్రల్ కమాండ్స్ నుంచి యుద్ధ విమానాలతో పాటు ఇతర విమానాలు కూడా ఒక్కసారిగా ఒకే సమయంలో ఆకాశంలోకి ఎగిరాయి. ఇవన్నీ ఎక్కడికో పోతున్నాయో పాకిస్తాన్ అధికారులకూడా గందరగోళంలో పడ్డారు. కొద్ది సేపటి తర్వాత ఈ విమానాల గుంపులో నుంచి కొన్ని బాలాకోట్ వైపు మళ్లాయి. అక్కడ కూడా టెర్రిరిస్టులో ఏం జరగుతున్నదో గమనించే స్థితిలోనే లేరు. అంతా గాఢ నిద్రలోఉన్నారు.
బాలా కోట్ మీద భారత్ గురి పెడుతుందని ఎవరూ వూహించలేకపోయారు. చివరకు ఒకపుడు తుపాకుల మోతతో, జైష్ ఇ మహమ్మద్ జిహాద్ నినాదాలతో మారుమోగిని ఈ శిబిరం కాందహార్ శిధిలాల్లా తయారయింది.
ఈ శిబిరం బాలకోట్ కు 20 కిమీ దూరాన కొండ మీద ఉంటే బాలా కోట్ ఆదీన రేఖకు 80 కిమీ దూరాన ఉంది. సాకిస్తాన్ షాక్ కు కారణమిదే… ఎల్ వొసి దాటి 80 కి.మీ పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు ఎలా రాగలిగాయనే.
ఈ గెలుపు మిరాజ్ 2000 దేనట
ఈ దాడిలో మరొక విశేషముంది. 1971 ఇండో పాక్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగం మీదికి శక్తివంతమయిన యుద్దవిమానాలను (మిరాజ్ ) ప్రయోగించడం ఇదే. పిన్ పాయింట్ లక్ష్యాన్ని చేధించడానికి ఈ ఫ్రెంచ్ మిరాజ్ 2000 పనికొస్తాయి. ఇవి బహళార్థసాధకాలు. వీటిలో ఒకే ఇంజన్ ఉంటుంది. బాంబులను, మిసైల్స్ ను, లైజర్ గైడెడ్ బాంబ్స్ ను కూడా ఇవి ప్రయోగించగలవు.ఈ విమానాలకు RDY (Radar Doppler Multi-target ఫ్రెంచ్ పొట్టిపేరు) అమర్చి ఉంటుందని, అది లక్ష్యాన్ని 100 శాతం కచ్చితంగా కొట్టేందుకు వీలు కల్పిస్తుందని మిలిటరీ వర్గాలు చెప్పాయి. భారత్ సైన్యం 30 సంవత్సరాల కిందట మిరాజ్ యుద్ధ విమానాలకు సేకరించుకుంది. ఇండో పాక్ గెలుపులోవాటి పాత్ర చాలా ఉందని చెబుతారు. ఇపుడువస్తున్న ఫ్రెంచ్ దాసో మిరాజు పాత వాటి ఆధునీకకరణ రూపాలే.   అందుకే బాలా కోట్ కొండమీది శిబిరం మీద గురిపెట్టేందుకు వీటిని వాడారు.