బాలాకోట్ దాడులా…అవేంటి? : బిజెపి అభ్యర్థి సన్నీడియోల్ షాకింగ్ అజ్ఞానం

భారత దేశంలో రసగుల్లాలు, గులాబ్ జామ్ లు తెలియని వాళ్ల ఎలా ఉండరో, బాలాకోట్ దాడులు అనే మాట వినని వాళ్లుండరు.

రెగ్యులర్ గా ప్రధాని నరేంద్ర మోదీ నోట వినిపించే మాట ఇది. బాలకోట్ లేకపోతే, ఇపుడుజరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఇంత జోష్ ఉండేదే కాదేమో. ఇలాంటి మాటను  బిజెపి అభ్యర్థులు ఎపుడో ఒక సారి తమ క్యాంపెయిన్ లో ప్రయోగించి తీరాల్సిందే.లేక పోతే, అది భారత సైన్యాన్ని అవమాన పరచినట్లవుతుంది. అయితే, ఒక ప్రముఖ బిజెపి అభ్యర్థి బాలాకోట్ దాడులు (Balakot strikes) అనే మాట  విననే లేదని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రపంచానికి వెల్లడించాడు.

 ఈ అభ్యర్థి ఎవరో కాదు, ప్రముఖ బాలివుడ్ నటుుడు, బిజెపి తరఫున పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న అభ్యర్థి సన్నిడియోల్.

 సన్నిడియోల్ ని జాతీయ వాదానికి ప్రతీకగా భారతీయ జనతా పార్టీ గురుదాస్ పూర్ లో నిలబెట్టింది. నిజానికి అక్కడి నుంచి  మరొకనటుడు కేంద్రంలో మాజీ  మంత్రి అయిన వినోద్ ఖాన్నా భార్యను నిలబెట్టాలనుకున్నారు. ఆమెకు ఈ విషయం చెప్పారు. సిద్ధంకమ్మన్నారు. అయితే, చివర్లో ఏమయిందో ఏమో ఆమెను కాదని  సన్నీడియోల్ పట్టుకొచ్చి అక్కడ పోటీకి నిలబెట్టారు. సన్నిడియోల్ తో   ఈ రోజు ఎన్ డిటివి కి చెందిన ఒక మహిళా రిపోర్టర్ కొద్దిా సేపు ముచ్చటించారు.

ఆమెతో  మాట్లాడుతూ  తాను దేశ సేవ చేసేందుకే పోటీ చేస్తున్నానని చెప్పారు. ఈ వరసలో ఆమె బాలాకోట్ దాడుల గురించి ప్రస్తావించారు. బాలకోట్ దాడులు జరిగాయి కదా, వాటి వల్ల భారత దేేశానికేదయినా మేలు జరిగిందా అని అడిగారు.

అయితే, బాలాకోట్ అనే మాట కూడా సన్నిడియోల్ విన్నట్లు లేరు. ఎపుడూ వినని ఆ మాట ఇపుడు వినిపించే సరికి కంగారు పడ్డారు.

ఎం దాడులు,  ఏ దాడులు? అని ఎదురు ప్రశ్న వేశారు.

ఎన్ డిటివి రిపోర్టర్ : అప్కో లగ్తా హై క్యా బాలాకోట్ స్ట్రయిక్స్ సే దేశ కో కుచ్ ఫాయిదా హువా హై?

(బాలాకోట్ దాడుల వల్ల దేశానికేమయినా ప్రయోజనం జరిగిందని అనుకుంటున్నారా?)

సన్నీడియోల్: క్యా స్ట్రయిక్? కౌన్సీ స్ట్రయిక్? ముఝే ఈ సబ్ కుచ్ పతా నహీ హై. ముఝే తో బస్ చునావ్ జీత్నా హై

(ఏం దాడులు, ఏదాడులు? అవన్నీ నాకు తెలియవు. నేను జస్ట్ ఎన్నికల్లో గెలవాలి అంతే)

 

ఈ వీడియో క్లిప్ ఇపుడు వైరలవుతూ ఉంది

ఇది నాకు చాలా షాకింగ్ అని గురుదాస్ పూర్ నుంచి సన్నీడియోల్ మీద పోటీ చేస్తున్న  కాంగ్రెస్ ప్రత్యర్థి సునీల్ జాకడ్ అన్నారు.

ఎందుకు షాకింగ్ అంటే, గురుదాస్ పూర్ పాక్ సరిహద్దున ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి.ఇక్కడ సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువ గా ఉంటాయి. అలాంటి చోట పోటీ చేస్తూ బాలాకోట్ అనే మాట విననే లేదు అంటే ఎలా?