బాలాకోట్ మీద దాడి : ఉపగ్రహ చిత్రాలు విడుదల

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ వద్ద భారతీయ వాయుసేన బాంబుల వర్షం కురిపించినా అక్కడి జెయిస్ ఇ మహమ్మద్ స్థావరాలు ఇంకా కనిపిస్తున్నాయని రాయిటర్ వార్తా సంస్థ చెబుతూ ఉంది. ఈ భవనాలను చూపే  హైరెజొల్యూషన్ పోటోలను రాయిటర్ విడుల చేసింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ కొండ మీద జెయిష్ శిక్షాణ శిబిరం మీద భారతీయ వాయుసేకు చెందిన ఒక డజన్ 2000 మిరాజ్ యుద్ద విమానాలు బాంబులేశాయని, దీనితో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని భారత ప్రభుత్వం చెబుతూ ఉంది. ఒక కథనం ప్రకారం ఈ దాడిలో 300 నుంచి 350 మంది దాకా చనిపోయారు. సైన్యం గాని, భారత రక్షణ శాఖ గాని మృతుల వివరాలు వెల్లడించడం లేదు. జెయిస్ స్థావరానికి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని మాత్రం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండే ప్లానెట్ లాబ్స్ అనే ప్రయివేట్ శటిలైట్ ఆపరేట్ చిత్రాలు బయటకు వచ్చాయి.మార్చి నాలుగో తేదీ తీసిన ఈచిత్రాలలో కనీసం ఆరుబంగళాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. దాడి జరిగి ఆరురోజుల తర్వాత కూడా ఇవి ఇలా కనబడుతున్నాయి.

ఇంతవరకు హై రెసొల్యూషన్ శటిలైట్ చిత్రాలు బయటకు రాలేదు. ప్లానెట్ ల్యాబ్ వెల్లడించిన చిత్రాలలో 72 సెం.మీద దాకా క్లారిటీ ఉంది.

ఈ ఫోటోల ప్రకారం, ఈ భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఈచిత్రాలు విశ్లేషించే ఈస్ట్ ఏషియా నాన్ ప్రొలిఫరేషన్ ప్రాజక్టు (మిడిల్ బరీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్) డైరెక్టర్ జెఫ్రీ లూయీస్ చెప్పారని ఒక వార్త వచ్చింది. (సోర్స్: దక్కన్ హెరాల్డ్)