ఫిబ్రవరి 14 న కాశ్మీర్ లోని పుల్వామా లో సిఆర్ పిఎప్ కాన్వాయ్ మీద టెర్రరిస్టు దాడి జరగడం, అందులో దాదాపు 40 మంది జవాన్లుచనిపోయిన దుర్ఘటన తర్వాత దేశమంతా ఒక సంఘటన కోసం ఎదురుచూసింది. అదెమిటో ఎవరికీ తెలియదు.
భారత్ దేశంప్రతీకారం తీర్చుకుంటుందని అంతా అనుకున్నారు, ఎలా,ఎపుడు, ఎక్కడ అనేది ఎవరికి తెలియదు… దేశమంతా ఆరోజు కోసం, ఆ వార్త వినేందుకు ఉత్కంఠతో ఎదురు చూసింది. ఆ వార్త 26 వ తేదీన పొద్దనే వెలువడింది.
మంగళవారం భారత దేశం, పాకిస్తాన్ గాఢ నిద్రలో ఉన్నపుడు, తెల్లవారుజామున 3.30 గం. సమయంలో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఎల్ వొసి (లైన్ఆప్ కంట్రోల్ ) దాటి బాలకోట్ (పాకిస్తాన్ భూభాగం)ఏరియా లోకి చొరబడి అక్కడ ఒక కొండమీద ఉన్న జెయిష్ ఇ మహ్మద్ శిక్షణా శిబిరం మీద బాంబుల వర్షం కురపించాయనే వార్త వచ్చింది.
దేశమంతా హర్షద్వానాలు వెలువడ్డాయి. ఇదొక విషయం. మరొక ఆసక్తి కరమయిన ఈ దాడి వెనక ఉన్న శక్తి. సాధారణంగా ఇలాంటి విషయాలు అంత తొందరగా బయటకు రావు. అయితే, ఇపుడు ఆ శక్తి ఎవరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
ఈ దాడికి పథకం వేసి, ‘విజయవంతం’గా అమలుచేసిన మిలిటరీ వీరుడి గురించి మూడుముక్కలు చెప్పుకోవాలి.
బాలాకోట్ దాడి వెనక ఉన్నవీరుడు ఎయిర్ మార్షల్ చంద్రశేఖరన్ హరి కుమార్. ఆయన శుక్రవారం సాయంకాలం బాధ్యతలనుంచి రిటైరయ్యారు. ఈ దాడి విజయవంతంగా పూర్తి చేసి వాయుసేన సర్వీసులో తన చివరి రోజు చారిత్రాత్మకం చేసుకున్నారు. అరవై జన్మదినం రోజున వాయుసేన నుంచి 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత పదవీ విరమణ పొందారు. బాలా కోట్ దాడి నాటికి ఆయన భారతీయ వాయు సేన వెస్టన్ ఎయిర్ కమాండ్ కు కమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్నారు.
‘ ఎయిర్ మార్షల్ ఫిబ్రవరి 26న 60 వ జన్మ దినం జరుపుకున్నారు. చివరి దాకా ఆయన సోల్జర్ లాగానే గడిపారు. ఆయన బాలాకోట్ దాడిని స్వయంగా పర్యవేక్షించారు. విజయవంతంగా అమలయ్యేలా చూశారు.రిటైర్ కావడానికి ఒక రోజు ముందున కూడా ఆయన స్వయంగా యుద్దవిమానాలతో జరిగిన దాడికి దర్శకత్వం వహించారు.పాకిస్తాన్ వాయుసేన నుంచి వచ్చిన ఎదురుదాడలను తిప్పికొట్టారు. ఈ రెండు సమర్థవంతమయిన సైనిక చర్యలకు దేశమంతా ప్రశంసల వర్షం కురిపించింది. దేశ నాయకత్వం నుంచి ఆయన వ్యక్తిగతంగా అభినందనలు లభించాయి,’ అని వెస్టన్ ఎయిర్ కమాండ్ ఒకప్రకటనలో పేర్కొంది.
ఎయిర్ మార్షల్ చంద్రశేఖరన్ హరికుమార్ రిటైర్ మెంట్ మీద పాకిస్తాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వెస్టన్ ఎయిర్ కమాండ్ ఈ అసాధారణ ప్రకటన విడుదల చేసింది.
బాలాకోట్ దాడిలో 300 నుంచి 350 మంది తీవ్రవాదులు, శిక్షకులు చనిపోయారని భారత సైనికవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఒక్కరూ చనిపోలేదని, భారత్ మిరాజ్ 2000 యుద్ధవిమానాలు వేసిన బాంబులు ఒక నిర్జన ప్రదేశం లో పడ్డాయని, ఎవరూ చనిపోలేదని , ఈ దాడి విఫలమయిందని పాకిస్తాన్ సోషల్ మీడియా , సైన్యం ప్రచారం మొదలుపెట్టింది.
భారత్ దాడులు ‘సర్జికల్ స్ట్రయిక్స్ 2.0’ వృధాఅయ్యాయని,అందుకే హరికుమార్ ను తొలగించారని పాక్ సోషల్ మీడియా కోడై కూస్తున్నది. హరికుమారన్ రిటైర్ మెంటును ఆసరా చేసుకుని పాకిస్తాన్ దుష్ర్రచారం మొదలు పెట్టింది.
పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎయిర్ వైస్ మార్షల్ ఆర్ జి కె కపూర్ భారత్ దేశం కేవలం ఒక మిగ్ -21 బైసను విమానాన్ని మాత్రమే కోల్పోయిందని, పాకిస్తాన్ బందీగా పట్టుకున్న పైలటే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అని కపూర్ పేర్కొన్నారు.
బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ పచ్చి అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఉంది. ఇందులో మొదటిది భారత్ కు చెందిన రెండు విమానాలు కూల్చేశామన్నది. రెండో ది ముగ్గురు పైలట్లను పట్టుకున్నామన్నది. తర్వాత ఇద్దరు పైలట్లేనని సవరించుకున్నారు. చివరకు ఆ రోజు సాయంకాలానికి ఒక్కరే తమకు చిక్కారని చెప్పింది,’కపూర్ ప్రకటనలో పేర్కొన్నారు.
హరికుమార్ రిటైరయ్యిన తర్వాత ఆయన స్థానంలో మరొక కార్గిల్ హీరో ఎయిర్ మార్షల్ రఘనాథ్ నంబియార్ ను నియమించారు. అంతకు ముందు ఆయన షిల్లాంగ్ లోని ఈస్టన్ ఎయిర్ కమాండ్ లో కమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్నారు. నంబియార్ కూడా చాలా అనుభవం ఉన్నవాడే. ఆయన 42 రకాల విమానాలను నడిపారు. మిరాజ్ 2000 మీద అంత్యంత ఎక్కువగా 2300 గంటల ‘ఫ్లయింగ్అవర్స్’ తో ఆయన విశిష్ట వాయు సైనికుడిగా పేరుంది. రాఫేల్ యుద్ధవిమానాలను నడిపిన తొలితరం పైలట్లలో నంబియార్ ఒకరు.