విస్తారా @ రూ.899

విస్తారా విమాన‌యాన సంస్థ ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 899 రూపాయ‌ల‌కే ఎకాన‌మీ క్లాస్ టికెట్ సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. సంస్థ 4వ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. 1,499 రూపాయ‌ల‌కు ప్రీమియం ఎకానమి క్లాస్‌, 4,999 రూపాయ‌లకు బిజినెస్ క్లాస్ టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ఈ ఆఫర్ 24 గంటలు మాత్రమే ఉంటుంది. శుక్ర‌వారం రాత్రి 11:59 నిమ‌షాల వ‌ర‌కు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫ‌ర్ కింద టికెట్ల‌ను కొనుగోలు చేసిన ప్ర‌యాణికులు వ‌చ్చేనెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 మధ్య కాలంలో ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఎకానమి క్లాస్, ప్రీమియం ఎకానమి క్లాస్‌ టికెట్ కొనుగోలు చేయాలనుకునేవారు కనీసం 15 రోజుల ముందుగా టికెట్ బుకింగ్ చేసుకోవాలని సంస్థ యాజ‌మాన్యం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించింది. బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు కనీసం నెల రోజులు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్ల‌డించింది.