Ticket price: టికెట్ల రేట్లు పెంపుపై పవన్ లాజిక్ కరెక్టే… మరి ప్రేక్షకుల పరిస్థితి ఏంటి సార్?

Ticket price: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది ఎవరైతే మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తారో అలాంటి వాటికే ప్రేక్షకులు కూడా ఆదరణ తెలుపుతున్నారు. ఇలా క్వాలిటీ అలాగే మంచి కంటెంట్ ఉండాలి అంటే తప్పనిసరిగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక్కో సినిమాకు వందల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుంది.

ఇలా సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ ఖర్చు చేసే సినిమా చేసి తిరిగి ఆ డబ్బును రాబట్టుకోవాలి అంటే సినిమా టికెట్ల రేట్లు పెంచడం అనేది సర్వసాధారణం. గత కొంతకాలంగా భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాలు కూడా టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతి తెలుపుతున్నాయి. ఇక ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న సంధ్య థియేటర్ ఘటన కారణంగా తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచనని రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ఏపీలో మాత్రం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు.

ఇలా ఈయన సినిమాకు ఖర్చుపెట్టిన బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా పెరిగిన రేట్లు దాదాపు15 రోజుల వరకు వర్తిస్తాయి అంటూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇలా సినిమా టికెట్లు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని స్వయంగా పవన్ తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అలాగే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పడం కూడా మంచి లాజిక్ అనే చెప్పాలి.

ఇలా నిర్మాతలకు లాభాలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సరే మరి సాధారణ మధ్యతరగతి ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒకసారి కూడా డిప్యూటీ సీఎం గారు ఆలోచించాలి కదా అంటూ నేటిజన్స్ నుంచి వినతులు వస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్లు ఒక వారం రోజులపాటు పెంచితే పరవాలేదు తిరిగి మరో వారంలో మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు తన కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలను చూస్తారు అలా కాకుండా పది నుంచి 15 రోజుల వరకు సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు థియేటర్లలో సినిమా చూసే అనుభూతిని కోల్పోతారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల రేట్లు పెంచితే బాగుంటుంది అంటూ పలువురు పవన్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.