ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా 100 శాతం డబ్బులు తిరిగి పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మనలో చాలామంది ట్రైన్ టికెట్ ను నెల, రెండు నెలల ముందే బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే చివరి నిమిషంలో వేర్వేరు కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రయాణం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. అయితే ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా కొన్ని సందర్భాల్లో నూటికి నూరు శాతం డబ్బులను వెనక్కు పొందవచ్చు. అప్పుడప్పుడూ రైలులో ప్రయాణించే వాళ్లు ఈ విషయాల గురించి తెలుసుకుంటే మంచిది.

సాధారణంగా ట్రైన్ టికెట్ ను కొనుగోలు చేసి క్యాన్సిల్ చేసుకుంటే కొంత మొత్తం ఛార్జీలను కట్ చేసుకుని రైల్వే శాఖ డబ్బులను రీఫండ్ చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే రైలు టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులు రైలు రావడానికి 180 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే టికెట్ ను క్యాన్సిల్ చేసుకుని రిఫండ్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రైలు ఆలస్యం కావడం విషయంలో తప్పు రైల్వే శాఖదే కాబట్టి రైల్వే శాఖ టికెట్ డబ్బులు వాపస్ చేస్తుంది. అయితే ఆఫ్ లైన్ లో టికెట్ తీసుకున్న వాళ్లు టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాలంటే సమీపంలోని రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ కు వెళ్లి టీడీఆర్ ఫామ్ నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా నూటికి నూరు శాతం రిఫండ్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్లు ఏదైనా కారణాల చేత టికెట్ ను క్యాన్సిల్ చేసుకుంటే 3 నుంచి 7 రోజుల్లోగా ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు రీఫండ్ కాని పక్షంలో టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించడం ద్వారా సులువుగా రీఫండ్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.