సామాన్యులకు అదిరిపోయే తీపికబురు.. గ్యాస్ సిలిండర్‌పై బంపర్ ఆఫర్ ఇదే!

ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ ను వాడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సిలిండర్ ధరలు పెరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతంతో పోల్చి చూస్తే గ్యాస్ సిలిండర ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో పోల్చి చూస్తే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు తక్కువగానే ఉంటాయి.

అయితే గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకునే వాళ్లు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా డబ్బును ఆదా చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎయిర్‌టెల్‌ థాంక్స్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.

ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ ధర 858 రూపాయలుగా ఉంది. డెలివరీ బాయ్స్ కొన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ ధరలతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ విధంగా బుకింగ్ చేయడం ద్వారా 80 రూపాయల మేర క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇతర పేమెంట్ యాప్స్ కూడా కొన్ని సందర్భాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ పై క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

గ్యాస్ సిలిండర్స్ బుకింగ్స్ యాప్స్ ను ఉపయోగించి బుక్ చేయడం ద్వారా కచ్చితంగా దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్స్ ను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం ద్వారా డెలివరీ బాయ్స్ కు కొన్ని సందర్భాల్లో అదనంగా చెల్లించే అవకాశాలు తగ్గుతాయి.