అరుణ్ జైట్లీ మీద ‘బాంబు’ వేసిన విజయ్ మాల్యా

అందరి అనుమానాలు ఇపుడు తొలగిపోయాయి.ప్రధాని మోదీకి, ఆయన ప్రభుత్వానికి తెలియకుండా విజయ్ మాల్యా మహారాజాలాగా దేశం విడిచి ఎలా విడిచిపోతారని అందరికీ అనుమానంగానే ఉంది.  నీరవ్ మోదీ, వాళ్ల మామ చౌస్కీ కూడా ఏలిన వారికి తెలిసిన దారిలోనే దేశాన్ని ముంచి చల్లగా జారుకున్నారని కాంగ్రెస్  కే కాదు, దేశ ప్రజలందరికీ అనుమానమే. ఎక్కడెక్కడినుంచి గంజాయి పోతున్నదో బంగారు బిస్కెట్లు వస్తున్నాయో కనుక్కునేసెక్యూరిటీ సిబ్బంది ఆరడగుల ఆజానుబాహులు పెట్టె బేడ భజానేసుకుని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోంచి, సిసిటివి లు పని చేస్తుండగా వెళ్ళిపోయిన విషయం ప్రభుత్వానికి తెలియదంటే నమ్మాలి. అయితే,  నమ్మకూడదు అని విజయ్ మాల్యా యే అంటున్నారు.

ఆయన ఈ రోజు లండన్ ఒక బాంబు లాంటి నిజాన్ని ఎన్ డి ఎప్రభుత్వంలో  నీతులు చెప్పడానికి ఎపుడూ ఉవ్వీళ్లూరే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీద వేశాడు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు ‘నేను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశాను. మాట్లాడాను.లెక్కలు తేల్చుకుందామనిపదే పదే అడిగాను. నాకు జెనీవాలో అర్జంటు మీటింగొకటి వుంటే వచ్చాను,’ అని అసలు సంగతి చెప్పాడు.

 

అయితే, అరుణ్ జైట్లీ లాయర్ కదా. ఏ విషయాన్నయినా తనకనుకూలంగా మార్చుకోగలడు.   మాల్యా తన కలిసిన విషయాన్ని కొొంత ఖండించారు. కొంతవప్పుకున్నారు.  మాల్యా చెప్పింది తికమక పెట్టే లా చెప్పారు . మాల్యా చెప్పింది ‘Factually false in as much as it does not reflect truth.” (నిజానికి అది అబద్దం. ఆ స్టేట్ మెంట్ లో నిజం కనిపించదు) దీనర్థం ఏమిటో సామాన్యులకు అర్థమయిచస్తుందా.

‘‘ 2014 నుంచి నేనసలు మాల్యా కు అపాయంట్ మెంటే ఇవ్వలేదు.అలాంటపుడు  ఆయనతో ఎలా కలుస్తాను. ఆయన తన రాజ్య సభ్యత్వం హోదాని దుర్వినియోగం చేశాడు. పార్లమెంటులో సభనుంచి నేను నా రూం కు పోతున్నపుడు ఆయన వడివడిగా నాదగ్గరకు వచ్చాడు. లెక్కలు సెటిల్ చేసుకునేందుకు ఒక అవకాశమిస్తానన్నట్లేదో ఒక మాట అన్నాడు,’జైట్టీ మొత్తానికి  మాల్యా మాట్లాడిన విషయం బయటపెట్టాాడు. ఈ విషయం తన ఫేస్ బుక్ వాల్ మీద రాసుకున్నాడు.