ఇది ఇండియా.. అభివృద్ధి ఎంతోమంది ఐడియా..!

వ్యక్తి కంటే దేశం గొప్పది..

I admire modiji.. Besides I Respect somany others who are/were responsible for making INDIA this great..

Modi is one of the leaders of INDIA.. but India is not made by Modi alone..

Ofcourse modi is not the only hero born in this great NATION..

ఎవరూ పుట్టుకతోనే హీరో కాడు..

ఆయా సమయాలు.. పరిస్థితులను అనుసరించి హీరోలుగా ఎదుగుతారు.. కొంతమందైతే అప్పటికప్పుడు పుట్టుకొస్తారు.. A hero is not born.. He raises to the occassion!

ఎవరి కోసమూ ఏదీ ఆగదు.. జరగాల్సింది జరుగుతుంది..

వారధి నిర్మాణంలో ఉడుత భాగస్వామి అయిన భూమి మనది..

సైన్యం లేకపోయినా వానర సమూహాన్ని పక్కన పెట్టుకుని రావణున్ని గెలిచిన రాముడు పుట్టిన గడ్డ ఇది..

గాంధీ ఒక్కడి వల్లనే స్వతంత్రం రాలేదు.. ఎందరో హీరోలు ఉన్నారు ఆ చారిత్రక సంగ్రామంలో..!

ఏ దేవుడైన దిగివచ్చి ఆదుకోడా.. ఇలా తలచినంతనే గిరిజనులను తెల్లదొరల ఆగడాల నుంచి రక్షించిన అల్లూరిని మరచిపోతే ఎలా..!?

స్వతంత్రం వచ్చినప్పటికి తీరూతెన్నూ లేని దేశాన్ని మొదటగా దారిలో పెట్టి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టింది ఎవరు..!?

నెహ్రూ మరణిస్తే ప్రభుత్వం.. పాలన ఆగిపోలేదే.. లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహానేత ఉన్నత పీఠాన్ని అధిరోహించి ఏలుబడి సాగించలేదా..

శాస్త్రి అకాలమరణం అనంతరం ఇందిరమ్మ ప్రధాని అయి ప్రపంచ ఉక్కు మహిళగా పేరు గాంచలేదా.. భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర ఆమెది కాదా.. ఇండియాని అగ్రదేశాల సరసన కూర్చోబెట్టడంలో ఆమె నాయకత్వ పటిమ ఎంత కీలకమో మర్చిపోగలమా..!

ఇందిర హత్యానంతరం రాజీవ్ గాంధీ రెడీమేడ్ ప్రధానిగా కొలువై అతి తక్కువ కాలంలోనే పంజాబ్..అస్సాం సమస్యల్ని పరిష్కరించి దేశప్రజల జేజేలు అందుకోలేదా.. భారత దేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించలేదా..!

ఇక పివి నరసింహారావు.. ప్రధాని అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. మైనార్టీ ప్రభుత్వం.. రాజకీయ అనుభవం లేని మన్మోహన్ సింగ్ జతగా ఆర్థిక సంస్కరణలు.. ఈ రోజున నువ్వూ నేనూ.. మనందరం అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలు ఆయన తెగువ..చొరవల పుణ్యమే కదా..!

నందా.. మొరార్జీ..విపిసింగ్.. వాజపేయి..ఇలా ఎందరు ప్రధానులు,బహువిధానులు!

దేశ అభివృద్ధిలో ఇందరు మహానాయకులు..కీలక వ్యక్తులు భాగస్వాములై ఉంటే ఇప్పుడు ఇండియా సాధించిన స్థానానికి కేవలం 2014 లోనే బీజాలు పడినట్టు ఏమిటీ కలరింగులు..భారత్ వరల్డ్ లీడర్ కావడానికి మోడీ ఒక్కరే కారకులా..మోడీకి ముందు అసలు ఏమీ జరగలేదా..!

భారత్ ఏమైనా మోడీకి ముందు..మోడీ తర్వాత అనుకునే దేశమా.. 2014 కి ముందు పరిశ్రమలు..ప్రాజెక్టులు.. సంస్కరణలు..హైవేలు.. వ్యవసాయం..ఆలయాలు.. యుద్ధాలు..అణుపరీక్షలు.. పంచవర్ష ప్రణాళికలు.. బడ్జెట్లు..విదేశీ సంబంధాలు.. శాస్త్ర పరిశోధనలు..రాష్ట్రాల అభివృద్ధి..ఇవేవీ జరగలేదా. ఇదంతా గత తొమ్మిదేళ్ళ కాలంలోనే జరిగిపోయిందా..!

స్కాములు కూడా మోడీకి ముందు సాగిన ఏలుబడిలోనే జరిగి మోడీ వచ్చాక ఆగిపోయాయా..!? ఇప్పుడూ జరుగుతున్నాయి.. రూపం మారింది. అంతే..కాకుంటే నీరవ్ మోడీ..లలిత్ మోడీ..విజయ్ మాల్యా..ఇత్యాదులు ఇన్ని వందల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో దర్జాగా ఎలా తిరుగుతున్నారు.అంబానీ…అదానీ ఆస్తులు లక్షల కోట్ల రూపాయల మేర ఎలా పెరిగిపోతున్నాయి.ధనవంతులు ఇంకా ధనవంతులుగా ఎలా మారిపోతున్నారు.కొత్త కొత్త కోటీశ్వరులు ఎలా పుట్టుకొస్తున్నారు. కోటీశ్వరుల్లో ఇంతమంది పన్నులు ఎగ్గొట్టి సోగ్గా ఎలా తిరగ్గలుగుతున్నారు.

సరే.. మోడీజీని ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించటం లేదు.కానీ భారతదేశం ఇంతవరకు సాధించిన ప్రగతి మొత్తం ఆయన వల్లనే అంటున్నందుకే ఈ కథనం అంతా..ఇంకో మాట..మోడీ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని ఇటీవల తెగ స్టోరీలు వచ్చేస్తున్నాయి.వ్యక్తి పూజ మత్తులో దేశం ఘనతను మర్చిపోతున్నాం. నెహ్రూ మొదలుకుని నిన్న మొన్న మన్మోహన్ సింగ్ వరకు ఏ ప్రధానికైనా విదేశీ పర్యటనల్లో ఇంతటి గౌరవమే లభించింది.అది ఇండియా గొప్పదనం. ప్రపంచదేశాల్లో భారత్ కు ఉన్న గౌరవం.అసలు పదవే లేని గాంధీని విశ్వనేతగా ఇప్పటికీ..ఎప్పటికీ గౌరవిస్తున్న సంగతి ప్రతి భారతీయునికీ తెలిసిందే. అది మనందరం గర్వించవలసిన విషయం.

ఇక మరో కీలక అంశం.. కాంగ్రెస్ మతతత్వ పార్టీ అన్నట్టు ఇటీవలి కాలంలో పరంపరగా కథనాలు వచ్చేస్తున్నాయి.వీటినే పెయిడ్ ఆర్టికల్స్ అంటారు. దేశంలో ఇంతకు మునుపు చాలా చోట్ల చాలాసార్లు మత ఘర్షణలు జరిగిన మాట వాస్తవమే అయినా అప్పటి కంటే ఇప్పుడు దేశంలో మతప్రస్తావన వినిపించడం ఎక్కువైపోయింది..ఈ నిజాన్ని ఎవరు కాదనగలరు. పూర్వం మత విబేధాల గురించి మాట్లాడడానికి వెనకంజ వేసేవారు జనం. కాని ఇప్పుడు యధేచ్చగా ప్రతి విషయాన్ని మతంతో ముడిపెట్టడం సర్వసాధారణం అయిపోయింది.ఆఖరికి గాంధీ..నెహ్రూ కుటుంబాలను..వారి జననాలను కూడా వక్రీకరిస్తూ విచ్చలవిడిగా పోస్టింగులు పెట్టేస్తున్నా పైనున్న వారు వినోదం చూస్తున్నారే గాని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెయ్యటం లేదు.ఎందుకంటే..అవి కొన్ని శక్తులు ఒక పథకం ప్రకారం రాయిస్తున్నవి.

అసలు కధలు ఇలా ఉంటే.. దేశాన్ని ఈ స్థితికి తెచ్చిన హీరోలు ఎందరో ఉంటే.. భారతదేశంలో పుట్టిన మొదటి హీరో మోడీనే అన్నట్టు ఈ బిల్డప్పులు ఏంటో..అంతేకాదు..ఇక మోడీ తప్పించి దేశానికి మరో గత్యంతరం లేదన్నట్టు అదో ఊకదంపుడు..నిజానికి అది దేశాన్ని…దేశపౌరులను అవమానించడమే..!