బ్రేకింగ్ : వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి సీరియస్

మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గత పది సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నారు. మంచానికే పరిమితమయ్యారు. బిజెపి ప్రభుత్వం వాజ్ పేయికి భారత రత్న బిరుదు ఇచ్చి సత్కరించింది. భారత రత్న ఇచ్చిన సమయంలో కూడా వాజ్ పేయి అనారోగ్యంతోనే ఉన్నారు. భారత రత్న ఇచ్చిన విషయం కూడా ఆయన గుర్తించిన పరిస్థితి లేదు.

మచ్చ లేని మహోన్న నేతగా వాజ్ పేయి నిలిచారు. ఆయన నైతిక విలువలకు పెద్ద పీట వేశారన్న పేరుంది. ఒక్క ఓటు కోసం అడ్డదారులు తొక్కకుండా ఏకంగా తన ప్రభుత్వాన్నే పోగొట్టుకున్న వ్యక్తి ఆయన. ఆయన నిబద్ధతను గుర్తించిన ప్రజలు మళ్లీ ఆయనకు పట్టం కట్టారు. 

వాజ్ పేయి ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. జూన్ 12వ తేదీన ఆయన అనారోగ్యంతో ఉన్న ఆయనను ఎయిమ్స్ లో చేర్పించారు.  ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని బిజెపి శ్రేణులకు ఇప్పటికే అందజేశారు. దీంతో బిజెపి నేతలంతా తమ తమ రాష్ట్రాల్లో అధికారిక కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్నారు. రేపు గురువారం బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు  బిజెపి ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి ఒక ప్రకటనలో చెప్పారు. 

వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ నుంచి బిజెపి పార్టీ నేతలకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున బిజెపి నేతలు ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. 

వాజ్ పేయి కవిత ‘గీత్ నయా గాతా హూ’