మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గొప్ప వక్త, పండితుడు, కవి కూడా. ఈ రోజు 94వ జయంతి. దేశ రాజకీయాల మీద ఆయన వేసిన ముద్ర చెరగనిది. ఈ ఏడాది ఆగస్టు 16న మృతి చెందారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వాజ్ పేయికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రీ య స్మృతి స్ధల్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. కాగా వాజ్‌పేయి గౌరవార్ధం ఆయన బొమ్మతో ముద్రించిన వంద రుపాయల నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు.వాజ్‌పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినంగా పాటిస్తున్నది.
1.ఈ సందర్భంగా వాజ్ పేయి జీవితంలో కొన్ని ముఖ్యమయిన ఘట్టాలు:
2.1942లో వాజ్ పేయి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సోదరుడు ప్రేమతో కలసి అరెస్ట య్యారు. 23 రోజుల పాటు బ్రిటిష్ ఇండియా జైలులో ఉన్నారు.
3.వాజ్ పేయి కాన్పూర్ లోని డిఎవి కాలేజీలోనే పిజి,న్యాయ విద్య అభ్యసించారు. తండ్రి ఆయనకు సహాధ్యాయి. ఇద్దరు ఒకే హాస్టల్ గదిలో ఉన్నారు. 1945లో వాజ్ పేయి డిఎవి కాలేజీలో న్యాయశాస్త్రంలో చేరారు. అయితే, అపుడే ఆయన తండ్రి కృష్ణ బిహారీ లాల్ వాజ్ పేయి కూడా అదే కోర్సు లో చేరారు. తండ్రి అప్పటి కే 30 సంవత్సరాలు టీచర్ గా పనిచేసి రిటైరయ్యారు. ఆపైన న్యాయవిద్యలో చేరారు. తండ్రి కొడుకులు క్లాస్ మెట్స్ మాత్రమే కాాదు, రూమ్ మేట్స్ కూడా. ఇదొక అరుదైన ఘట్టం.
4.రాజకీయాల్లోకి రాకుముందు వాజ్ పేయి జర్నలిస్టుగా పని చేశారు.ఆర్ ఎస్ ఎస్ నేత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నడిపే రాష్ట్ర ధర్మలో, ఆర్ ఎస్ ఎస్ అధికార పత్రిక పాంచజన్యలోనూ పనిచేశారు.
5.ఆర్ ఎస్ ఎస్ కంటే ముందు వాజ్ పేయి కొద్ది రోజు కమ్యూనిజం ప్రభావంలో కూడా పడ్డారు. 1939లో బాబా సాహెబ్ ఆప్టే తో ప్రభావితుడయి ఆయన ఆర్ ఎస్ ఎస్ లో చేరారు.
6.1957లో ఆయన మొదటి సారి లోక్ సభకు ఎన్నికయ్యారు.1975-77 మధ్య ఎమర్జన్సీ కాలంలో ప్రతిపక్ష నేతలందరితో పాటు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపారు.
7.1957లో ఆయన వాజ్ పేయి ప్రసంగం ప్రధాని నెహ్రూ మీద చెరగని ముద్ర వేసింది. ‘ఈ కుర్రవాడు భవిష్యత్తులో ఒక రోజు దేశ ప్రధాని అవుతాడు’ అన్నారు. అది నిజమయింది.
8.వాజ్ పేయి మూడుసార్లు ప్రధాని అయ్యారు. 19992004 దాకా పూర్తి కాలం ప్రధాని ఉండి , అయిదేళ్లు అధికారంలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధాని అయ్యారు.
9.1977లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగం చేశారు. అక్కడ హిందీ భాష వినిపించడం అదే ప్రథమం.
10.లోక్ సభకు 9 సార్లు ఎన్నికయి వాజ్ పేయి ఒక రికార్డు సృష్టించారు. రెండు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు.
1998లో ప్రధాని అయిన నెలలోపే ఫోక్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు.
11.1999 ఢిల్లీ -లాహోర్ బస్ సర్వీస్ ను ప్రారంభించారు.
12.తాను రాజకీయాలనుంచి విరమించుకుంటున్నట్లు 2005, జనవరి 29 ప్రకటించారు. ఇలా ప్రకటించిన ప్రధాని ఆయనే.
13.ఆయన గొప్ప కవి. నయీ దిశ (1999), సంవేదన (2002) సంకలనాలు మ్యూజిక్ తో అల్బమ్ గా వెలువడ్డాయి. 2015 లోప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ‘భారత రత్న’తో సత్కరించారు.