బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్దపీట వేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద పీట వేసింది. మన సైనికులే మనకు గర్వకారం, దేశ రక్షణలో వారి త్యాగాలు చిరస్మరణీయం అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నేడు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు.

40 ఏండ్ల పాటు పెండింగ్ లో ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను తమ ప్రభుత్వం అమలు చేసిందని పీయూష్ గుర్తు చేశారు. ఇందుకోసం ఇప్పటికే 35 వేల కోట్లు విడుదల చేశామన్నారు.