కల్లోల కేరళకు 700 కోట్లు విరాళం ప్రకటించిన మారాజు

వరద భీభత్సం వలన కేరళకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులకు సహాయక చర్యలు అందిస్తోంది ప్రభుత్వం. జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తోంది. పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా దేశం నలుమూలల నుండి కేరళకు విరాళాలు అందిస్తూ, తమకు తోచిన సహాయం చేస్తున్నారు ప్రజలు.

ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీ యూఏఈ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం కేరళకు అండగా నిలవటానికి ముందుకొచ్చారు.  కేరళకు 100 మిల్లియన్ డాలర్లు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 700 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఆర్ధిక సహాయం ఇస్తుండగా యూఏఈ 700 కోట్లు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకొచ్చి ఔదార్యాన్ని చాటుకుంది.