Gujarat Assembly Election: ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్తిగా టీవీ యాంకర్.!

Gujarat Assembly Election:  దేశ రాజకీయాల్లో ఇంకో సంచలనం.! మరో సామాన్యుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం దక్కేలా వుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే సామాన్యుల పార్టీ. సామాన్యుడే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి ఇంకో సామాన్యుడు పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు.

తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేలా వున్నాడో సామాన్యుడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన దరిమిలా, ప్రధాన రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రేసులో అందరికన్నా ముందుంది ఆమ్ ఆద్మీ పార్టీ. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించేశారు.

కొండకు వెంట్రుకని వేద్దాం.. వస్తే కొండ వచ్చింది.. లేదంటే వెంట్రుక పోతుంది.. అన్నట్లు కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారా.? అంటే, ఆమ్ ఆద్మీ పార్టీనిగానీ, ఆ పార్టీ అభ్యర్థుల్నిగానీ వెంట్రుకలతో పోల్చడం సబబు కాదు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీల్ని ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ తరిమికొట్టేశారు మరి.!

పంజాబ్‌లోనూ కాంగ్రెస్, బీజేపీలకు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గుజరాత్ లెక్క వేరు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమిది. మోడీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పరిపాలించిన రాష్ట్రం గుజరాత్. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఎంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

టీవీ యాంకర్‌గా పనిచేసిన ఇసుదాస్ గడ్వీని ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ పోలీ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించి.. దానికి అనుగుణంగానే సీఎం అభ్యర్థిని ఎంపిక చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్వీ, సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. గుజరాత్ జనాభాలో వున్న 48 మంది బీసీలకు ప్రతినిథిగా ఆయన గురించి చెబుతున్నారు. అసలు ఈ అద్భుతాన్ని తాను ఊహించలేదని అంటున్నారు ఇసుదాస్ గడ్వీ.