BJP – AAP: అప్పుడే వేట మొదలుపెట్టిన బీజేపీ, ఆప్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు ఇచ్చారు. సెక్రటేరియట్ లోని ముఖ్యమైన ఫైళ్లను రక్షించడానికి, అవి ఏవిధంగానూ తరలిపోకుండా ఉండేందుకు, సెక్రటేరియట్‌ను సీజ్ చేయాలని జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

గత పదేళ్లుగా ఆప్ పాలనపై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉంది. లిక్కర్ స్కామ్, శీష్ మహల్ వివాదం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఢిల్లీ రాజకీయాలను కుదిపేశాయి. ప్రధాని మోదీ గతంలోనే, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇప్పుడు, ఆ చర్యలకు బీజేపీ సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మొదటి నుంచి కూడా స్పష్టమైన ఆధిక్యంలో ఉండటంతో, ఆప్ ప్రధాన నేతలు ఓటమి అంచున నిలిచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలో, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జంగ్ పురాలో మొదట్లోనే ఓటమి చెందారు. బీజేపీ మొత్తం 70 స్థానాల్లో 48 చోట్ల విజయం సాధించగా ఆప్ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. సెక్రటేరియట్ సీజ్ నిర్ణయం ద్వారా, బీజేపీ ఇకపై మరిన్ని దర్యాప్తులను వేగవంతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ ప్రభుత్వం పాలనపై అధికారిక విచారణలు ఎలా సాగుతాయో వేచిచూడాలి.

చిరుతో మోదీ సీక్రెట్ డీల్ | Cine Critic Dasari Vignan About Modi Praises Mega Star Chiranjeevi || TR