సెక్స్ రాకెట్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలు

వ్యభిచార రాకెట్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్టు తేలింది. దీంతో ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల అరెస్టు అసోం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణంలో సంచలనం రేపింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇందులో ఇద్దరు వ్యభిచారులను అరెస్టు చేశారు. ఈ వ్యభిచార రాకెట్ వెనుక బీజెపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏఐయూడిఎఫ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే పాత్ర  ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో పోలీసులు బీజెపి ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్, ఏఐయూడిఎఫ్ కు చెందిన నిజాముద్దీన్ చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచార రాకెట్ లో ఎమ్మెల్యేలతో పాటు కొందరు అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, న్యాయవాదుల పాత్ర ఉందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. వ్యభిచారిణులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని, ఈ సెక్స్ రాకెట్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని కచార్ జిల్లా ఎస్పీ రాకేష్ రౌషన్ వెల్లడించారు. ఈ వ్యభిచార రాకెట్ తో తమకు సంబంధం లేదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.