టెలివిజన్ లో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో కూడా ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో ఐదు సీజన్ లో పూర్తి చేసుకొని ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయింది. అయితే ఎప్పటిలాగే కొంతమంది ఈ రియాలిటీ షో కి మద్దతు పలుకుతుంటే మరి కొంత మంది మాత్రం ఈ షో మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు రాజకీయ నాయకులు సైతం బిగ్బాస్ రియాలిటీ షో పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ రియాలిటీ షో గురించి రాజకీయ నాయకుడు సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. ఇక ఇటీవల నాగార్జునని ఉద్దేశించి కూడా నారాయణ విమర్శలు చేశాడు. బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌస్ అని ఈ షో వల్ల ప్రేక్షకులు పక్కదోవ పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 లో శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున మెరీనా రోహిత్ లను కౌగిలించుకొని ముద్దు పెట్టుకోమని చెప్పాడు. ఎందుకంటే మీరిద్దరూ భార్యాభర్తలు అని చెబుతూ.. నారాయణ నారాయణ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అంటాడు. దీంతో అందరూ నాగార్జున ఇన్ డైరెక్ట్ గా సిపిఐ నారాయణ మీద కౌంటర్ వేసినట్లు భావిస్తున్నారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాట అనలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా ఎవరైనా జోక్ చెబితే నారాయణ నారాయణ నాకు అలవాటు అందువల్లే ఆ మాట అన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ సిక్స్ గురించి మాట్లాడుతూ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సీరియస్ గా ఆడుతున్నారు ? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు? అన్న విషయం గురించి విశ్లేషించుకుంటే జీవితానికి ఒక పాఠం లో అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను వదిలి తెలియని వారి దగ్గర అన్ని కెమెరాలు ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంతా సులువైన పని కాదని జీవితంలో ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని అనుకోవటం లేదని నాగార్జున వెల్లడించాడు.