సైకో పోవాలి సైకిల్ రావాలి.. చంద్రబాబుకు ఈ స్థాయిలో అధికార దాహమా?

chandrababu-naidu-reuters-1139326-1661445251

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విమర్శల విషయంలో వేగం పెంచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సైకో అంటూ చంద్రబాబు చేసిన విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే చంద్రబాబు విమర్శలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆశించిన స్థాయిలో లేదు.

చంద్రబాబులో అధికార దాహం ఊహించని స్థాయిలో ఉందని నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయని 2024 ఎన్నికల్లో అవే ఫలితాలు ఎదురైతే తప్ప టీడీపీకి తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మారాల్సింది ప్రజలు కాదని చంద్రబాబు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతుందో చెప్పాలని జగన్ అమలు చేసిన పథకాలనే చంద్రబాబు కూడా అమలు చేస్తే మరో పార్టీతో అవసరం ఏముందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమై ప్రస్తుతం పోలీసులపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.

చంద్రబాబు ఇరుకు సందులలో సభలను ఎందుకు నిర్వహించాలనుకున్నారో ఎందుకు చెప్పడం లేదని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన ప్రజల కుటుంబాలకు డబ్బులు ఇస్తే ఆ నష్టం భర్తీ అవుతుందా? అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.