భారత విమానాలను కూల్చిన పాక్ పైలెట్లు వీరే

పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాల పై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. భారత్ చర్యలతో పాక్ రెచ్చిపోయి భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు యత్నించింది. ఈ దాడిలో మిగ్ 21 విమానం కూలిపోయి పాక్ భూభాగంలో చిక్కుకుంది. పాక్ మాత్రం రెండు విమానాలను కూల్చినట్టు ప్రకటించుకుంది. తాజాగా భారత యుద్ద విమానాలను కూల్చిన ఫైటర్ పైలెట్లను గుర్తించి వారి పేర్లను పాక్ ప్రకటించింది.

ఒక భారత యుద్ద విమానాన్ని కూల్చిన వ్యక్తి స్క్వ్రాడన్ లీడర్ హసన్ సిద్ధిఖీ కాగా మరొకరు నమౌనా అలీఖాన్ గా గుర్తించామన్నారు. ఈ దాడుల్లో సిద్దిఖీ చనిపోయాడని పాక్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి తెలిపారు. పాక్ పార్లమెంటు సిద్దిఖీకి నివాళులర్పించింది. ముందుగా పాక్ ఎవరూ చనిపోలేదని ప్రకటించినా జాతీయ మీడియా, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో తప్పనిసరి నిజాన్ని వెల్లడించింది.