పూజారిపై ఉమ్ము వేసిన మహిళ…. మహిళలను ఈడ్చుకెళ్లిన సిబ్బంది?

సాధారణంగా మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ గౌరవ మర్యాదల సంగతి పక్కన పెడితే కనీసం మహిళల్ని మనుషులుగా చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందుకు నిదర్శనమే ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన. ఆలయానికి వెళ్లిన మహిళపై ఆలయ సిబ్బంది చేయి చేసుకోవడమే కాకుండా ఆమెను జుట్టు పట్టుకొని ఆలయం నుండి బయటకు లాక్కు వెళ్లిన ఘటన సంచలనంగా మారింది. అయితే మహిళ పట్ల ఆలయ సిబ్బంది ఇలా ప్రవర్తించడానికి గల కారణమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వివరాలలోకి వెళితే… బెంగళూరులో ఉన్న ఒక ఆలయానికి వెళ్లిన మహిళ తాను వెంకటేశ్వర స్వామి భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే తాను కూడా కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించకపోవటంతో ఆగ్రహించిన ఆ మహిళ పూజారిపై ఉమ్మింది. ఇలా పూజారి మీద ఉంగటంతో ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి వెంటనే ఆమెను ఆలయంలో నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆలయంలో నుండి బయటకు వెళ్లడానికి ఆ మహిళ ప్రతిఘటించటంతో మెడపట్టి బయటికి గెంటాలని ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ ఆ మహిళ చాలా దృఢంగా ఆలయంలో నుండి బయటకు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో ఆలయ సిబ్బంది ఆగ్రహానికి గురై ఆమె మీద చేయి చేసుకోవటమే కాకుండా జుట్టు పట్టి మరి ఆలయంలో నుండి బయటకి లాక్కెళ్లారు. అంతేకాకుండా ఆమె మీద దాడి చేయడానికి ఇనప రాడ్డు తీసుకురాగా పూజారి ఆపటంతో ఆమెను ఆలయం నుండి బయటికి గెంటేశారు. గుడిలో జరిగిన ఈ సంఘటన మొత్తం అక్కడ ఉన్న సిసి కెమెరాలు రికార్డు అయింది డిసెంబర్ 26వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటికి రావటంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.