విద్యార్థిని బట్టలు మురికిగా ఉన్నాయని విప్పించి ఉతికేసిన ఉపాధ్యాయుడు.. సీన్ కట్ చేస్తే సస్పెన్షన్..!

మురికి బట్టలు వేసుకుని పాఠశాలకు వచ్చిందన్న కారణంతో ఒక ఉపాధ్యాయుడు పదేళ్ల బాలికను తోటి విద్యార్థుల ముందు బట్టలు విప్పించి దాదాపు రెండు గంటల సేపులో దుస్తులతోనే నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్లో ఇటీవల సంచలనం రేపుతుంది. విద్యార్థిని దుస్తులు మురికిగా ఉన్నాయని స్వయంగా ఉతికి అరబెట్టిన ఉపాధ్యాయుడు మీద సస్పెన్షన్ వేటు పడింది.

వివరాలలోకి వెళితే…శహడోల్ జిల్లా బారాకాల గ్రామంలోని జైసింగ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక దుస్తులు మురికిగా ఉన్నాయని ఉపాధ్యాయుడు అందరి ముందు ఆమె దుస్తులు ఇప్పించి తానే స్వయంగా ఉతికి ఆరబెట్టాడు. దీంతో బాలిక కేవలం లోదుస్తులు రెండు గంటల పాటు తోటి విద్యార్థుల ముందు ఉండిపోయింది.

అయితే సదరు ఉపాధ్యాయుడు తాను చేసిన పని గొప్పతనం గురించి తెలియచేయడానికి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు పదేళ్ల చిన్నారి బట్టలు విప్పించి అవమానించినందుకు గాను సదరు ఉపాధ్యాయుడుని విధుల నుండి తొలగిస్తూ సస్పెండ్ చేశారు.