కోపంతో మృగంలా మారి మామయ్య చెవిని కొరికిన అల్లుడు.. ఎక్కడంటే?

కొన్నిసార్లు చిన్న చిన్న వివాదాలు కూడా పెద్దగా మారి ప్రాణాల మీదకు తీసుకువస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇలా చిన్న విషయానికి గొడవపడి ఏకంగా చెవులు ముక్కు పోగొట్టుకున్నారు బీహార్ కు చెందిన మనేశ్వర్‌ ఠాకూర్‌. చిన్న విషయానికి గొడవపడి ఏకంగా దాడిలో తన ముక్కు చెవులు పోగొట్టుకున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

బిహార్‌, వైశాలి జిల్లాకు చెందిన మనేశ్వర్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి కుటుంబానికి పక్కనే తన చెల్లి కూడా నివాసం ఉంటుంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య తరచూ ఏవో ఒకటి చిన్నపాటి గొడవలు తలెత్తుతున్నాయి. ఇకపోతే గత రెండు రోజుల క్రితం మహేశ్వర్ తన చెల్లెలు ఇంటి వద్ద ఉన్న పొడి వంట చెరుకుపై తడివంట చెరుకు పెట్టారు. దీంతో తన చెల్లెలు కుమారుడు ఒక్కసారిగా తన మామయ్య పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనని తిట్టారు.

ఈ విధంగా వంటచేరుకు విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇలా మొదలైన ఈ గొడవ చిరికి చిరిగి గాలి వానలా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని స్థాయికి వెళ్లారు.ఈ విధంగా మామ పై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అల్లుడు తనపై దాడి చేసి తన చెవులను అలాగే ముక్కును కొరికేశాడు. ఇలా వీరి వివాదం ముదరడంతో స్థానికులు కలుగజేసుకొని తనని హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స చేయడం వీలు కాదని తనని పాట్నా హాస్పిటల్ కి తరలించారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన చెవి ముక్కును సర్జరీ చేయాలని వెల్లడించారు. ఇక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.