పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 18 స్థానాలు బీజేపీ గెలవడంతో దాదాపు 40 శాతం ఓట్లు రావడం జరిగింది. దీంతో ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై భారీగానే వ్యూహాలను సిద్ధం చేశారు బీజేపీ పెద్దలు. ఇలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు బయటకు రావటం ఆ పార్టీని బాగా డామేజ్ చేసింది. ఇంకా 30, 40 మంది వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడం తో బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి తిరుగులేని పరిస్థితి ఉన్నట్లు నాయకులు అంచనాకు వచ్చారు.
కానీ తాజాగా వస్తున్న సర్వేల ఫలితాలు చూసి బీజేపీకి ఓటమి గ్యారెంటీ అనే టాక్ వినపడుతుంది. వివరాలలోకి వెళితే ఇటీవల జరిగిన ఎబిపి-సీ-ఓటర్ సర్వేలో బీజేపీ పార్టీకి 95 నుండి 105 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 145 నుండి 150 కి పైగా గెలిచే ఛాన్స్ ఉందని .. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ సర్కార్ కి ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల ఆలోచన ఒకలా ఉంటే ప్రజల తీరు చాలావరకూ మమతా బెనర్జీ పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజేపి పార్టీ నిరీక్షణ ఈ సారి కూడా ఫలించేలా లేదు.