అర్థరాత్రి ఫుట్ పాత్ మీద చేతి వాటం చూపించిన డాక్టర్.. ఆ తర్వాత జరిగి సీన్ షాక్ అవ్వాల్సిందే!

డాక్టర్ అంటే అందరికీ కనిపించే దేవుడితో సమానం. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, అత్యంత విషమ పరిస్థితులలో కూడా రోగి ప్రాణాలు కాపాడటమే డాక్టర్లు ప్రథమ లక్ష్యంగా పనిచేస్తుంటారు. కులమత భేదాలకు అతీతంగా డాక్టర్ తన విధులు నిర్వహిస్తుంటారు. అయితే రాజస్థాన్ లో ఒక డాక్టర్ తన వృత్తికి విరుద్ధంగా ఒక పాడు పని చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే….. డాక్టర్ శైలేంద్ర రాజస్థాన్ లోని భరత్ పూర్ కి చెందిన హోమియోపతి డాక్టర్. ఈయన అర్ధరాత్రి 2.45 గంటల ప్రాంతంలో తన ముగ్గురు స్నేహితులతో బైక్ లపై వచ్చి రోడ్డు పక్కన దుప్పట్లు అమ్ముకుంటున్న వ్యాపారి నుండి 8 దుప్పట్లు దొంగలించి స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాల మీద పారిపోయారు. అప్పటివరకు గాఢ నిద్రలో ఉన్న వ్యాపారి మెలకువ వచ్చి తన సరుకు చూసుకోగా . ఎవరో దుప్పట్లు దొంగలించారని గ్రహించాడు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన ఆ వ్యాపారి వెంటనే సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ కు అందించాడు.

దుప్పట్ల వ్యాపారి ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇక స్థానికంగా కైలాదేవి నేషనల్ పార్క్ సమీపంలో నలుగురు యువకులు బైక్ పై వస్తుండడం పోలీసులు గమనించారు. మొదటగా వీరు లేట్ నైట్ పార్టీలకు వెళ్లి వస్తుండవచ్చు అని పోలీసులు అనుకున్నారు. అయితే పోలీసులను చూసిన యువకులు, కంగారుపడి తమ చేతిలో ఉన్న దుప్పట్ల కవర్లను రోడ్డు పక్కన పడేసి పారిపోవడానికి యత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు అప్రమత్తం కావడంతో యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నలుగురు యువకులలో ఒకరు మైనర్ కాగా, మిగిలిన వారిలో ఒకరు డాక్టర్ శైలేంద్ర, తన సహచరులు దీపక్, రాహుల్. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.