ప్రస్తుత కాలంలో కొంతమంది యువకులు అమ్మాయిలని ప్రేమ పెళ్లి అంటూ మోసం చేసి వారి నగ్న ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని చూపించి అమ్మాయిలని బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల కూడా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే…తమిళనాడుకు చెందిన వికాస్ రాజన్ తన ఎంబీబీఎస్ పూర్తిచేసి కొంతకాలం చెన్నైలో ప్రాక్టీస్ చేసిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాడు. అక్కడ వికాస్ కి ప్రతిభ అనే ఆర్కిటెక్చర్ పరిచయం అయింది. వీరి పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహానికి కూడా సిద్ధపడ్డారు. అయితే వికాస్ తన ప్రేయసి ప్రతిభ నగ్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతిభ ఎందుకు ఇలా చేశావని వికాస్ ని నిలదీయగా సరదా కోసం చేశారని సమాధానం చెప్పాడు.
వికాస్ చెప్పిన సమాధానంతో ప్రతిభ తీవ్ర అగ్రహానికి గురైంది. ఇటీవల స్నేహితులందరితో కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఇస్తున్నానని చెప్పి వికాస్ ని పిలిపించింది ఈ క్రమంలో అతనికి బాగా మద్యం తాగించి మద్యం మత్తులో ఉన్న వికాస్ ని తన స్నేహితులతో కలిసి దాడి చేసింది. ఈ క్రమంలో వికాస్ తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కోల్పోయాడు. ఆ తర్వాత ప్రతిభ ఆసుపత్రికి తరలించగా వికాస్ కోమాలోకి వెళ్లి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతిభ ఆమె స్నేహితుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.