తరచూ పాస్ పోస్తున్నాడని చిన్నారి మర్మాంగాలకు వాత పెట్టిన అంగన్వాడి టీచర్.. ఎక్కడంటే?

పసిపిల్లలు దేవునితో సమానం అని అంటుంటారు ఎందుకంటే. పసిపిల్లలకు ఎంతో నిర్మలమైన మనసు ఉంటుంది. వారికి మంచి చెడూ గురించి అవగాహన ఉండదు. చిన్న వయసులో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అవగాహన ఉండదు. చిన్న పిల్లల చేసే అల్లరి పనులు తల్లితండ్రులకు చాలా ముద్దుగా ఉంటాయి. కానీ కొన్నసార్లు సందర్భాలలో వారు తెలియక చేసేపనుల వల్ల ఎదుటివారికి చాలా కోపం వస్తుంది. ఇలా ఒక చిన్నారి చేసే పని వల్ల విసిగిపోయిన అంగన్వాడి టీచర్ ఆ చిన్నారికి చాలా కఠినమైన శిక్ష విధించింది. చిన్నారి పదేపదే పాస్ పోస్తున్నాడని అతని మర్మాంగాలకు వాతలు పెట్టింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

సాధారణంగా మాటలు రాని చిన్న పిల్లలు వారికి
ఆకలేసిన చెప్పలేరు. మూత్రం, మలం ఎప్పుడు వస్తుందో కూడా వారు చెప్పలేరు. చిన్నపిల్లలను చూసుకుని తల్లిదండ్రులు అలాగే అంగన్వాడి పాఠశాలలో ఉండే టీచర్లకు కూడా ఎంతో ఓపికగా ఉండాలి. కానీ, ఈ అంగన్వాడి టీచర్ మరీ రాక్షసంగా ప్రవర్తించింది. వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని తమకూరు జిల్లాలో ఓ అంగన్‌వాడి సెంటర్‌లో ఓ చిన్నారికి తరచూ మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో పదే పదే అంగన్వాడి సెంటర్ లో కూడా ఇలా చేస్తుండటంతో అంగన్వాడీ టీచర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్నారిని భయపెట్టాలనే ఉద్దేశంతో అతని ప్రైవేట్ పార్ట్‌కు వాత పెట్టింది.

దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారి ఆ బాధ భరించలేక గుక్కపట్టి ఏడ్చాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక అది గమనించిన కుటుంబ సభ్యులు టీచర్‌ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్‌తో పాటు.. తొడలపైనా వాతలు పెట్టినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గురించి సమచారం అందుకున్న ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై విచారణ జరిపి అంగన్‌వాడీ టీచర్, సహాయకులకు నోటీసులు జారీ చేశారు. కుటుంబసభ్యులు చిన్నారికి జన స్వాస్థ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో చిన్నారి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కూడా అంగన్వాడి టీచర్ పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.