జమ్మూలో మరో సారి ఉగ్రదాడి… ఇద్దరు టెర్రరిస్టుల హతం

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో  ఉగ్ర దాడిలో 43 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. సోమవారం భారత సైన్యం పింగ్లాన్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఓ ఇంట్లో నుంచి ఇద్దరు ఉగ్రవాదులు జవాన్ల పై కాల్పులు జరిపారు. దీంతో అలర్ట్ అయిన భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

పుల్వామా దాడి కీలక సూత్రధారి, జైషే మహ్మద్ కు చెందిన  రషీడ్ ఘజీ, కమ్రాన్ ను సైన్యం కాల్చి చంపింది. ఈ కాల్పుల్లో మేజర్ సహా మరో ముగ్గురు జవాన్లు చనిపోయారు. పుల్వామ జిల్లాతో పాటు కీలక ప్రాంతాలను సైన్యం జల్లెడ పడుతోంది. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ లో మరో ఉగ్రవాది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సైన్యం తన వేట కొనసాగిస్తోంది.