ఈ ఫొటోలో కనిపిస్తోన్న కుర్రాడి పేరు రామ్‌సింగ్. వయస్సు 19 సంవత్సరాలు. మధ్యప్రదేశ్‌లోన ఇండోర్ సమీపంలోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. మఎప్పుడు లేచిందో గానీ, అతని కుడి మోకాలి పై భాగంలో ఓ చిన్న కురుపు లాంటిది కనిపించింది. చిన్నదే కదా అనుకున్నాడు. నిర్లక్ష్యం చేశాడు. ఆ నిర్లక్ష్యమే అతని ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఆ కురుపు కాస్తా రామ్‌సింగ్‌తో పాటే పెరిగి పెద్దదైంది.
ఎంత పెద్దగా తయారైందంటే.. ఆ కుర్రాడికి ఎన్ని సంవత్సరాలో..దాని కంటే రెండు కేజీల బరువు ఎక్కువకే చేరుకుంది. ఆ కురుపు ఏ మాత్రం తగ్గకపోగా- పెద్దగా మారుతుండటంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించారు కుటుంబ సభ్యులు. అది ట్యూమర్‌గా తేలింది. వైద్య పరిభాషలో ఆ ట్యూమర్‌ను `స్పిండిల్ సెల్ సర్కోమా` అంటారట. దీనితో స్థానిక డాక్టర్లు అతణ్ని ఇండోర్‌లోని మహరాజా యశ్వంత రావు హోల్కర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.
రామ్‌సింగ్‌ను పరిశీలించిన పెద్దాసుపత్రి డాక్టర్లు అతని కాలిని తొలగించారు. సుమారు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స చేసిన అనంతరం కాలిని తొలగించినట్లు డాక్టర్లు ఆర్‌కె మాథుర్, సోనియా మోజెస్, ఆనంద్ అజ్మీర్ తెలిపారు. కాలిని తొలగించిన అనంతరం- రామ్‌సింగ్ ఆరోగ్యం మెరుగు పడిందని చెప్పారు. ఈ ట్యూమర్ రామ్‌సింగ్‌కు వంశపారంపర్యంగా వచ్చిందని నిర్ధారించడం నిర్ఘాంతపరిచే విషయం.