శబరిమల దేవస్థానంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే దానిని ప్రస్తుతం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పాటించడం లేదు. ఈ అంశం పై దాదాపు 54 పిటిషన్లు నమోదయ్యాయి. 10 నుంచి 50 సంవత్సరాలు కలిగిన మహిళలకు దేవస్థానంలోకి గతంలో అనుమతి లేదు.
అయితే సుప్రీం కోర్టు అందరికి అనుమతిచ్చినా ప్రస్తుతం అది అమలు కావడం లేదు. నమోదైన పలు పిటిషన్లను సుప్రీం బుధవారం విచారించగా గతంలో ఇచ్చిన తీర్పును తాము పాటిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. కాగా ఈ అంశం పై మిగిలిన వారి భావనలను కూడా గౌరవించాల్సి ఉందని కోర్డుకు తెలిపింది. లైంగిక వివక్షను అంతమొందించాల్సిన అవసరముందని… అన్ని వయసుల వారిని దేవాలయంలోకి అనుమతిస్తామని బోర్డు కోర్టుకు విన్నవించింది. ట్రావెన్ కోర్ బోర్డు సడన్ గా మాట మార్చడం పై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనను విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.