ప్రమాదం ఎప్పుడు వైపు నుంచి దూసుకు వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే ఒక్కసారిగా ఇలాంటి ప్రమాదాలు జరిగితే తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్నటువంటి బస్సులో అకస్మాత్తుగా మంటలు రావడంతో పదిమంది సజీవ దహనం అయ్యారు.
మహారాష్ట్ర నాసిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాశిక్ లో ప్రయాణికులతో బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఔరంగాబాద్ రహదారిపై వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి దీంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు పదిమంది సజీవ దహనం కాక 32 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
ఈ క్రమంలోనే గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.