భూత వైద్యం పేరుతో బాలికపై లైంగిక దాడి… బాలిక గర్భం దాల్చడంతో బయటపడిన అసలు నిజం!

దేశ రాజధాని ఢిల్లీ లో రోజు రోజుకి అత్యాచార ఘటనలు ఎక్కువ అయిపోతున్నాయి. వావి వరుస, వయసు తో సంబంధం లేకుండా కామం తో అనేకమంది విచక్షణ రహితంగా మహిళల పై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కొంత మంది వైద్యం చేస్తున్నట్టు నమ్మబలికి కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ లో వెలుగులోకి వచ్చింది. భూత వైద్యం పేరుతో ఒక మాంత్రికుడు బాలిక పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చిన్నారికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లదండ్రులు ఇటీవల ఒక భూత వైద్యుడిని సంప్రదించారు. దీంతో భూత వైద్యం పేరుతో ఆ మాంత్రికుడు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నరిని బెదిరించాడు. దీంతో బాలిక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టింది. ఇక ఇటీవల బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం తో తల్లి తండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక గర్భంతో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో బాలికను విచారించగా భూత వైద్యుడు గురించి అసలు విషయం చెప్పింది.

దీంతో కంగు తిన్న తల్లి తండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి భుత వైద్యుడి మీద ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి తండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే రంగంలోకి దిగి ఈ దారుణానికి పాల్పడిన భూత వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ భూత వైద్యుడు గతంలో కూడా ఇలా అమ్మాయిలని మోసం చేసి లైంగిక వేధింపులకు గురి చేసాడేమో అన్న దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.