లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి.
ఇందులో ఒకటి ఆయన మీద వస్తున్న బయోపిక్ కు సంబంధించిందయితే,రెండోది అతంత్య కీలకమయిన వ్యవహారం, రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసును తిరగదోడటానికి సంబంధించినది.
ఎన్నికల కమిషన్ కు వెన్నెముక బలహీన పడింది, స్వతంత్రంగా నిలబడి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం పని చేసేలా చర్యలు తీసుకోవాలని 66 మంది మాజీ కేంద్ర ప్రభుత్వం సీనియర్అధికారలు రాష్ట్రపతికి లేఖ రాసిన 24 గంటల్లోనే మోదీకి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. లేఖలో పేర్కొన్న ఫిర్యాదుల్లో ప్రధానిమోదీ బయోపిక్ ను ప్రదర్శనకుఅనుమతించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధపడుతూ ఉండటం. అయితే, బుధవారం నాడు మోదీ బయోపిక్ ప్రదర్శనను ఎన్నికలయిపోయే వరకు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఎన్నికల్లో పాల్గొంటున్న వారి ప్రయోజనాలను హాని కలిగించే విధంగా ఉన్న ఎవరీ బయోపిక్ ను అనుమతించేందుకువీలులేదని కూడా కమిషన్ పేర్కొంది. ఈ మేరకు కమిషనర్ల సంతకాలతో ఒక విస్తృతమయిన 6 పేజీల ఉత్తర్వును జారీ చేశారు. ఇందులో లక్ష్మీస్ NTR, PM Narendra Modi, కెసిఆర్ మీద తీసిన ‘ఉద్యమ సింహం’ పేర్లను స్పష్టంగా పేర్కొంటూ వాటిని ప్రదర్శించడం మోడల్ కోడ్ కాండక్ట్ ను అతిక్రమించడమే అవుతుందని ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
“…So far, the Commission has received complaints about certain cinemas namely ‘NTR Laxmi’, ‘PM Nardendra Modi’, and Udyma Simham’ which are claimed to either diminish or advance the electoral prospects of a candidate or a political party in the garb of creative freedom. It is claimed that such creative contents are a kind of surrogate publicity by the canidate or the political party during the period of MCC. Though the display material claim to be part of creative content, it is contended that these have propensity and potentiality to affect the level playing field which is not in consonance with the provisions of the Model Code of Conduct (MCC),” అని ఉత్తర్వులో స్పష్టంగా రాశారు.
ఇది మొదటి దెబ్బయితే,రెండోది సుప్రీం కోర్టు నుంచి ఎదురయింది. కొంతమంది పిటిఫనర్లు కోర్టు కు సమర్పించిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగా రాఫేల్ విమనాల కొనుగోలు కేసు మీద గతంలో వచ్చిన తీర్పును సమీక్షించేదుకువీలు లేదని మోదీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ రెండు బుధవారంనాడు, లోక్ సభకు జరుగుతున్న ఎన్నికల తొలివిడత పోలింగ్ కు ఒక రోజు ముందు మోదీకి ఎదురు కావడం విశేషం.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్, కెఎం జోషెఫ్ ల ధర్మాసనం రాఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో దాఖలయిన అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ కోర్టు డిసెంబర్ 14ను తీర్పు ను సమీక్షించే విషయాన్న రివ్యూ పిటిషన్ ఉన్న పస అధారంగా నిర్ణయిస్తామని చెప్పింది. బిజెపి నేతలు,మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు ఈ రివ్యూ పిటిషన్ వేశారు.
పిటిషనర్లు కోర్టుకు సమర్పించిన డాక్యమెంట్లను వారు చట్ట వ్యతిరేక మార్గంలో సేకరించారని కేంద్రం వాదించింది. కేంద్రం తరఫున వాదించిన అటార్ని జనరల్ కెకె వేణుగోపాల్ ఈ డాక్యుమెంట్లను రక్షణ శాఖ నుంచి ఎవరో తస్కరించారని మొదట కోర్టు కు చెప్పారు. తర్వాత ఈ తస్కరించలేదని, వాటిని అనుమతి లేకుండా ఎవర్ ఫోటోకాపి చేసుకున్నారని మాట మార్చడంతో కేంద్రం వాదన బలహీనపడింది.