కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం అమలు చేస్తున్న ఒక స్కీమ్ ద్వారా ఏకంగా 7 లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించాలని భావించే వాళ్లకు కేంద్రం నుంచి 5 లక్షల రూపాయల సహాయం అందుతుంది. మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు ఈ మొత్తంతో పాటు మరో 2 లక్షల రూపాయల సహాయం అందుతుంది.
తక్కువ ధరకే నాణ్యమైన మందులను అమ్మాలని భావించే వాళ్లు జన్ ఔషధి కేంద్రం ద్వారా మందులను విక్రయించవచ్చు. పేదలకు జనరిక్ మందులను అందించాలనే మంచి ఆలోచనతో మోదీ సర్కార్ ఈ స్కీమ్ అమలు దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం ఎక్కువ సంఖ్యలో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అర్హతలు ఉన్నవాళ్లు వెంటనే ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తే మంచిది.
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ కేంద్రాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు సైతం తక్కువ ధరలకే మందులు లభిస్తాయి. బ్రాండెడ్ మందులు ఏ రేటుకు లభిస్తాయో వాటికి చాలా రెట్లు తక్కువ మొత్తానికే ఈ మందులు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 120 అడుగుల చదరపు అడుగుల స్థలం ఉన్నవాళ్లు జన్ ఔషధి కేంద్రాలను తెరవవచ్చు. బీ ఫార్మసీ లేదా డీ ఫార్మసీ చదివిన వాళ్లు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.
https://janaushadhi.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ కేంద్రాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.